హరిహర వీరమల్లు విడుదలకు ఇంకో 27 రోజులు మాత్రమే సమయముంది. కొత్త రిలీజ్ డేట్ గురించి అందరికీ ఆల్రెడీ లీకైన విషయాన్నే అధికారికంగా చెప్పుకుని హడావిడి చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యింది. కనీసం ట్రైలర్ అప్డేట్ అయినా ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ప్రమోషన్లు నాన్ స్టాప్ గా ఉంటాయని చెప్పిన హామీకి భిన్నంగా తిరిగి మళ్ళీ ఆలస్యాలు జరగడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జూలై 24 అయినా ఖచ్చితంగా వస్తుందో రాదోననే అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు అర్జెంటుగా పబ్లిసిటీ పర్వం మొదలుపెట్టాలి.
హరిహర వీరమల్లు బృందం తక్షణం గుర్తించాల్సిన వాస్తవం ఒకటుంది. ఇప్పటికేబజ్ నెగటివ్ లో ఉంది. దాన్ని పాజిటివ్ గా మార్చాలి. ట్రైలర్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో రిలాక్స్ అవ్వడం మంచిది కాదు. ఇతరత్రా రూపాల్లో ప్రమోషన్ల వేగం పెంచాలి. ఈవెంట్లు చేయాలి. ఆర్టిస్టులతో ఇంటర్వ్యూలు ఇప్పించాలి. ఇతరత్రా కంటెంట్ కు సంబంధించిన వేడుకలు చేయాలి. ఇవన్నీ రెగ్యులర్ గా అందరూ చేసేవే. పవన్ కళ్యాణ్ మూవీకి అవసరం లేదని కొందరు అనొచ్చు. కానీ ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా సరే దాని మీద జనంలో వైబ్ రావాలంటే ప్రచార ఘట్టం చాలా కీలకం. రాజమౌళి ఇందులో మాస్టర్.
అసలు ఇంకా రెండు నెలల దూరంలో ఉన్న కూలి లాంటి సినిమాలు దూకుడు చూపిస్తుంటే వీరమల్లు ఇంత నిర్లిప్తంగా ఉండటం భావ్యం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పవనే డిప్యూటీ సిఎం. జనసేన వర్గాలు మంచి ఊపుమీదున్నాయి. బ్రో తర్వాత గ్యాప్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటే ఓపెనింగ్స్ నుంచే హరిహర వీరమల్లు అద్భుతాలు చేయొచ్చు. అసలే ఇది పార్ట్ 1. సీక్వెల్ కి బిజినెస్ బాగా జరగాలంటే మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయ్యిందని సమాచారం. జూలై రెండో వారంలో రావొచ్చని టాక్.
This post was last modified on June 28, 2025 6:44 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…