Movie News

బిచ్చగాడు హీరోకి రిలీఫ్ దొరికింది

ఎప్పుడో దశాబ్దం క్రితం వచ్చిన బిచ్చగాడుతోనే ఇంకా మార్కెట్ ని కాపాడుకుంటూ వస్తున్న హీరో విజయ్ ఆంటోనీ తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ గత రెండు మూడేళ్ళలో కనీసం థియేటర్ రిలీజ్ అయిన సంగతి కూడా తెలియక ముందే మాయమైపోయినవి ఎక్కువగా ఉంటాయి. ఖూనీ, తుఫాన్ లాంటి పేర్లు సగటు మూవీ లవర్స్ కూడా విని ఉండరు. కన్నప్పతో పాటుగా ఒకే రోజు రిలీజైన మార్గన్ కూడా అదే కోవలోకి చేరుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా దీనికి డీసెంట్ టాక్ వినిపిస్తోంది. కంటెంట్ జనానికి చేరేలా కనిపిస్తోంది.

కథ పరంగా చూస్తే పైకి మాములు క్రైమ్ థ్రిల్లర్ లాగే అనిపిస్తుంది. సిటీలో అమ్మాయిలను ఒక సైకో కిల్లర్ ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేస్తుంటాడు. దాని వల్ల వాళ్ళ శరీరాలు నల్లగా మారిపోతాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ధృవ్ (విజయ్ ఆంటోనీ)  కూతురు సైతం ఇదే తరహాలో చనిపోయి ఉంటుంది. దీంతో డ్యూటీలో లేకపోయినా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న ధృవ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. మొదటి అనుమానం అరవింద్ (అజయ్ దిశన్) అనే కుర్రాడి మీదకు వెళ్తుంది. కానీ అనూహ్య పరిణామాల తర్వాత అసలు హంతకుడు ఎవరో తెలిశాక షాక్ తినడం మన వంతవుతుంది.

దర్శకుడు లియో జాన్ పాల్ స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు. మరీ ఎక్స్ ట్రాడినరి అనలేం కానీ విసుగు రాకుండా కథనం నడిపించడంలో సక్సెసయ్యాడు. ముఖ్యంగా సస్పెన్స్ మైంటైన్ చేసిన విధానం, విలన్ ఎవరూ గెస్ చేయనివ్వకుండా డైవర్ట్ చేసిన తీరు బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ని సాగదీసిన తీరు ల్యాగ్ కు దారి తీసింది. సెకండాఫ్ లో స్పీడ్ కొంచెం తగ్గుతుంది. విజయ్ ఆంటోనీ కన్నా ఎక్కువగా అజయ్ దిశన్ స్క్రీన్ ని డామినేట్ చేశాడు. రెగ్యులర్ గా క్రైమ్ మూవీస్ చూసే వాళ్లకు మార్గన్ మంచి ఛాయసే అవుతుంది కానీ మరీ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు రేంజ్ లో అంచనాలు పెట్టుకోకుంటే చాలు. హీరోనే ఇచ్చిన బిజిఎం బాగుంది.

This post was last modified on June 27, 2025 10:29 pm

Share

Recent Posts

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

3 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

10 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

10 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

11 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

13 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

13 hours ago