పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు అనే బ్లాక్ బస్టర్ హీరో విజయ్ ఆంటోనీ మార్కెట్ ని ఇంకా కాపాడుకుంటూ రావడం విచిత్రమే. తర్వాత ఒకటి రెండు యావరేజ్ సినిమాలు వచ్చినా, హిట్ అని చెప్పుకోవడానికి ఒక్క మూవీ లేకపోయినా క్రమం తప్పకుండా ప్రేక్షకులను పలకరిస్తూన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం మార్గన్ రేపు విడుదల కానుంది. ప్రమోషన్ల పరంగా ఏదో కొంచెం సౌండ్ చేశారు కానీ ఆడియన్స్ ని అవి రీచ్ అయిన దాఖలాలు లేవు. ఏషియన్ సురేష్ సంస్థలు పంపిణి పరంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కనీస ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే. అయినా సరే తమిళంతో పాటు సమాంతర రిలీజ్ చేస్తున్నారు.
ఒకపక్క కుబేర స్ట్రాంగ్ గా ఉంది. ఇంకోవైపు కన్నప్పని పెద్ద ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య మార్గన్ నిలవడం పెద్ద సవాలే. విజయ్ ఆంటోనీ చివరిసారి హిట్టు ఎప్పుడు కొట్టాడంటే సమాధానం చెప్పడం కష్టం. కొన్ని పేర్లైతే అసలు వచ్చిన సంగతే జనాలకు గుర్తు లేనంత వేగంగా థియేటర్ నుంచి వెళ్ళిపోయి ఉంటాయి. అయినా సరే ప్రయత్నాలు ఆపకుండా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ ఆంటోనీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ జానర్ లో కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేయడం ఎంతో కొంత ఆసక్తిని రేపుతోంది.
తెలుగు సంగతి ఎలా ఉన్నా తమిళంలోనూ విజయ్ ఆంటోనీ మార్కెట్ పెద్దగా లేదు. ఏదో ఒక హిట్టు పడకపోదా అనే నమ్మకంతో ట్రయిల్స్ వేస్తూనే ఉన్నాడు. ఎడిటర్ గా కార్తీక్ సుబ్బరాజ్ లాంటివాళ్లతో పని చేసిన సుదీర్ఘ అనుభవమున్న ఎడిటర్ లియో జాన్ పాల్ ఇప్పుడీ మార్గన్ ద్వారా దర్శకుడి అవతారం ఎత్తారు. ట్రైలర్ గట్రా ప్రమోషన్లలో కంటెంట్ చూస్తేనేమో ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే అక్షరం ముక్క అర్థం కాకుండా మార్గన్ అని ఒరిజినల్ టైటిల్ నే కొనసాగించడం బాలేదు. ఈ మధ్య ఇది అందరూ చేస్తున్నదే అయినా కనీసం తెలుగు వాళ్ళకు అర్థమయ్యేలా పేరు పెట్టి ఉంటే బాగుండేది.
This post was last modified on June 26, 2025 8:10 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…