ఓవైపు వరుస ఫ్లాపులు, ఇంకోవైపు రాజకీయాల్లో బిజీ.. ఇలా కొన్నేళ్ల ముందు కమల్ హాసన్‌ను అందరూ మరిచిపోయే పరిస్థితి కనిపించింది. అలాంటి సమయంలో ‘విక్రమ్’ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈ లెజెండరీ నటుడు. ఆ సినిమా తమిళనాట హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా చాలా బాగా ఆడింది. ఇండియన్-2, థగ్ లైఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉండడంతో కమల్ మళ్లీ కెరీర్లో పీక్స్ చూడబోతున్నారని అభిమానులు ఆశించారు.
కానీ శంకర్ తీసిన ‘ఇండియన్-2’ కోలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ‘థగ్ లైఫ్’ అయినా హిట్టవుతుందనుకుంటే.. అది కూడా ‘ఇండియన్-2’ తరహా ఫలితాన్నే అందుకుంది. దీంతో కమల్ తిరిగి ‘విక్రమ్’కు ముందు స్థితికి వెళ్లిపోయారు. ఆయన మార్కెట్ మళ్లీ బాగా డౌన్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమల్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ‘విక్రమ్-2’ ప్రపోజల్ ఉంది కానీ.. అది ఇప్పుడిప్పుడే మొదలు కాదు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివుల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కానీ.. అది పెండింగ్‌లో పడిపోయింది. ‘ఇండియన్-3’కి సంబంధించి కొంత వర్క్ మిగిలి ఉండగా.. దాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఇవన్నీ కాదని కమల్ ఇప్పుడు ఓ కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. సిద్దార్థ్ మూవీ ‘చిన్నా’తో మంచి పేరు సంపాదించి.. ఇటీవల విక్రమ్ సినిమా ‘వీర ధీర శూర-2’ ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ నటించబోతున్నారట. విక్రమ్‌తో ‘వీర ధీర శూర-1’ కూడా చేయాల్సి ఉన్నప్పటికీ.. దాని కంటే కమల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట అరుణ్. కథ ఓకే అయింది. ‘థగ్ లైఫ్’ దెబ్బ కొట్టినప్పటికీ ఈ చిత్రాన్ని కూడా తన సొంత నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నాడట కమల్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
This post was last modified on June 25, 2025 11:14 am
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…