అందాల రాక్షసితో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్రకు నటుడిగా మంచి పేరే ఉంది కానీ హీరోగా దాన్ని నిలబెట్టుకునే దిశగా హిట్లు పడకపోవడంతో త్వరగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం విలన్ గా మారిపోయాడు. కేవలం స్టార్ కాంబో, డైరెక్టర్ బ్రాండ్ కోసం అరవింద సమేత వీర రాఘవ, గేమ్ ఛేంజర్, వీరసింహారెడ్డి, విరాట పర్వం లాంటి సినిమాలు చాలానే చేశాడు. దీంతో ఇక సోలో హీరోగా తనకు అవకాశాలు రావేమోనని అనుకోవడం సహజం. కానీ లేట్ ఇన్నింగ్స్ లో నవీన్ చంద్ర మళ్ళీ స్పీడ్ పెంచాడు. థియేటర్ రన్ తర్వాత ఓటిటిలో మంచి రేటు పలుకుతుండటంతో నిర్మాతలు ముందుకొస్తున్న వైనం కనిపిస్తోంది.
గత నెల కేవలం వారం గ్యాప్ లో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన బ్లైండ్ స్పాట్, లెవెన్ రిలీజయ్యాయి. మొదటిది వచ్చిన సంగతే గుర్తు లేనంతగా మాయమైపోగా లెవెన్ కు కాసింత బెటర్ రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో హిట్ అనిపించుకోవడం విశేషం. ఈ రెండు అమెజాన్ ప్రైమ్ లో ఇటీవలే ఒకే రోజు స్ట్రీమింగ్ కు రాగా తక్కువ టైంలోనే ట్రెండింగ్ కు వచ్చేశాయి. ఇవి ఇంకా ఫ్రెష్ గా ఉండగానే జూలై నాలుగున షో టైం పేరుతో మరో క్రైమ్ థ్రిల్లర్ తో పలకరించబోతున్నాడు. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగానే ఉంది. దృశ్యం తరహాలో ఫ్యామిలీ క్రైమ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కంటెంట్ ఆసక్తి రేపేలా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం నవీన్ చంద్ర చేస్తున్నవన్నీ క్రైమ్ సినిమాలే. వాటిలో కొన్ని నెగటివ్ షేడ్స్ లో సాగుతూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాయి. మంత్ అఫ్ మధు లాంటి హై ఎమోషనల్ మూవీస్ కన్నా ఇవే బెటరనిపిస్తున్నాయి. పరంపర, ఇన్స్ పెక్టర్ రిషి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్ లతో డిజిటల్ స్పేస్ లో ఇమేజ్ సంపాదించుకున్న నవీన్ చంద్ర ఇకపై ఎక్కువ ప్రాధాన్యం లేని సపోర్టింగ్ రోల్స్ చేయనంటున్నాడు. వచ్చే ఏడాదితో నవీన్ చంద్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. ఇప్పుడిలా కెరీర్ ఊపందుకోవడం విశేషమే. ట్విస్ట్ ఏంటంటే తను వెంటనే డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడట.
This post was last modified on June 25, 2025 6:45 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…