బొమ్మరిల్లుతో మనకు బాగా దగ్గరైన హీరో సిద్దార్థ్ ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్లు కొన్ని సాధించాడు కానీ ఆపై వచ్చిన వరస ఫ్లాపులు కెరీర్ ని దెబ్బ కొట్టాయి. ఇక్కడ వర్కౌట్ కావడం లేదని భావించి తమిళంలోనే సెటిలైపోయిన సిద్ధూ వచ్చే వారం జూలై 4 కొత్త మూవీ 3 BHKతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళ సినిమానే అయినప్పటికీ తెలుగులో డబ్బింగ్ చేసి ఒకేరోజు సమాంతరంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దర్శకుడు శ్రీ గణేష్. ఓటిటిలో రాజేంద్రప్రసాద్ కు పెద్ద హిట్టుగా నిలిచిన సేనాపతి ఒరిజినల్ వర్షన్ సృష్టికర్త ఇతనే. అందుకే 3 BKH మీద అంచనాలున్నాయి.
తెలుగులో దీనికి పెద్దగా సౌండ్ లేదు. అయినా సరే కంటెంట్ మెప్పిస్తుందనే నమ్మకంతో తన వంతుగా ప్రమోషన్లు బాగానే చేసుకుంటున్నాడు సిద్దార్థ్. ఇటీవలే టూరిస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడీ 3 BKH కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ కుటుంబ డ్రామాకు అమ్రిత్ రాంనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. టీజర్లు, పాటలు గట్రా చూస్తుంటే కాసింత చూడొచ్చనే సినిమాలాగే కనిపిస్తోంది. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో ఇంకో పది రోజులు వేచి చూడాలి
మహాసముద్రంతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ కు దాని ఫలితం నిరాశపరిచింది. ఎన్నో ఆశలతో చిత్తాని తెలుగులో ప్రమోట్ చేసుకుంటే మనోళ్లు రిసీవ్ చేసుకోలేదు. కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆనందం తప్ప ఇండియన్ 2 మిగిల్చింది సున్నా. మిస్ యు చిత్రం మిసరబుల్ గా ఫెయిలయ్యింది. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన టెస్ట్ కూడా డిజాస్టరయ్యింది. ఈ ట్రాక్ రికార్డు అంతా 3 BKHతో పోతుందని సిద్దార్థ్ నమ్మకంగా ఉన్నాడు. జూలై 4 నితిన్ తమ్ముడు తప్ప ఇంకే కాంపిటీషన్ లేకపోవడంతో 3 BKH మంచి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఓపెనింగ్స్ రావు కానీ టాక్ వస్తే మాత్రం దానికైన బడ్జెట్ రికవర్ అయిపోతుంది.
This post was last modified on June 24, 2025 4:01 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…