ఇంకో ఇరవై రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఘాటీ విడుదల కానుంది. జూలై 11 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని యువి క్రియేషన్స్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అభిమానులు అలెర్ట్ అయిపోయారు. అయితే ఇటీవలే విడుదల చేసిన మొదటి లిరికల్ సాంగ్ లో అనుష్కను చూపించి చూపించకుండా కేవలం రెండు షాట్లకు పరిమితం చేయడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఫీలవుతున్నారు. విక్రమ్ ప్రభుతో తన పెళ్లి జరుగుతున్న పాటగా ప్రొజెక్ట్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ కనీసం క్లోజ్ అప్ లో ఒక్క పిక్ చూపించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అసలు ఎందుకిలా డిజైన్ చేశారనే అనుమానం కలుగుతోంది
టైం చాలా పరిమితంగా ఉండటంతో ఘాటీ ప్రమోషన్ల స్పీడ్ పెంచాలి. టైటిల్ రోల్ అనుష్కనే కాబట్టి మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలో ఏదోలా మేనేజ్ చేశారు కానీ ఈసారి అదే రిపీట్ చేస్తారా అనే డౌట్ లేకపోలేదు. ఆ సినిమా రిలీజ్ టైంలో వీడియో బైట్స్ తప్ప అనుష్క తానుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈవెంట్ కు రావడం లాంటివి చేయలేదు. ఇప్పుడు ఘాటీ విషయంలో కూడా ఇలాగే చేస్తుందా అంటే ఏమో ఇప్పుడే చెప్పలేం. దర్శకుడు క్రిష్, డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ కనిపించినంత సేపు కూడా పాటలో అనుష్కని చూపించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
సరే ఇదంతా ఎలా ఉన్నా ఘాటీకి ప్రస్తుతానికి పెద్ద బజ్ లేదు. దాన్ని పెంచాలి. ఇప్పటికే పలు వాయిదాల వల్ల హైప్ తగ్గింది. అప్పుడెప్పుడో చిన్న టీజర్ తో ఆసక్తి పెంచారు కానీ తర్వాత సైలెంట్ అయ్యారు. గంజాయి వ్యాపారంతో మాఫియా డాన్ గా మారిన ఒక మహిళ బయోపిక్ గా రూపొందిన ఘాటీలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయట. హరిహర వీరమల్లుకు సరిగ్గా రెండు వారాల ముందు వస్తున్న ఘాటీకి ప్రస్తుతానికి ఎలాంటి కాంపిటీషన్ లేదు. కంటెంట్ కనక బాగుంటే అనుష్కకు మరో హిట్టు ఖాతాలో పడుతుంది. మరి ప్రమోషన్ల టైంలో అయినా స్వీటీ దర్శనం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి.
This post was last modified on June 23, 2025 10:04 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…