ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులు తెలిసి మాట్లాడినా…తెలియక మాట్లాడినా…కొన్ని కామెంట్లు కాంట్రవర్షియల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా విజయ్ దేవరకొండ మాట్లాడారని కేసు నమోదైంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేదికపై గిరిజనులను విజయ్ దేవరకొండ తీవ్రవాదులతో పోల్చాడన్న ఆరోపణలు రావడంతో ఆ కామెంట్స్ కాంట్రవర్షియల్ గా మారాయి. దీంతో, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గిరిజనులు ఫైర్ అయ్యారు. విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.
విజయ్ దేవరకొండ గిరిజనులను తీవ్రంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నాంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానపరిచేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో గిరిజనులను పోల్చేలా వాఖ్యానించడం వల్ల గిరిజనుల ఆత్మ గౌరవం దెబ్బతిందని కంప్లయింట్ ఇచ్చారు. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates