చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. నాగార్జున – ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన కుబేర సినిమా టాలీవుడ్‌కు అటు థియేటర్లకు ఊపిరి పోసింది. శుక్రవారం విడుదలైన కుబేర సినిమాకు మొదటి రోజు మార్నింగ్ షోలు మరియు అద్భుతంగా ఏమి ఓపెన్ కాలేదు. అయితే సినిమాకు అటు ఓవర్సీస్ నుంచి.. ఇటు ఆంధ్ర – నైజాంలో ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. తొలిరోజు సెకండ్ షోలు అన్ని హౌస్ ఫుల్ పడ్డాయి. శనివారం ఏ సెంటర్లలో అన్ని హౌస్ ఫుల్స్ అయ్యాయి. రూరల్ ఏరియాల్లో కాస్త తక్కువ కలెక్షన్లు కనిపిస్తున్నా ఈ సినిమా విషయంలో అది ముందు నుంచి ఊహించినదే.
ఏది ఏమైనా కుబేర సినిమాతో చాలాకాలం తర్వాత థియేటర్లు కాస్త కళకళలాడాయి అన్నది నిజం. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదలై ఉంటే జూన్ నెలలో టాలీవుడ్‌కు థియేటర్లకు మంచి ప్రారంభం ఉండేది. కానీ వీరమల్లు అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు కుబేర సినిమాకు హిట్ టాక్ రావడంతో వారం పది రోజులపాటు ఈ సినిమా హంగామా థియేటర్ల వద్ద కనిపించనుంది. కుబేర తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమా కూడా ఈ నెల చివర్లో విడుదల అవుతోంది. ప్రభాస్ కూడా ఉండడంతో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్ అయితే పక్కాగా ఉంటుంది. పైగా ఆధ్యాత్మిక సినిమా కావటం.. పలువురు స్టార్ హీరోలు ఉండడంతో సినిమా ఏ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయిన కుబేర ఇచ్చిన జోష్‌ను కన్నప్ప ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది.
ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కన్నప్ప కూడా హిట్ అయితే అది టాలీవుడ్‌కు చాలా ప్లస్ అని చెప్పాలి. ఆ తర్వాత నితిన్ నటించిన మాస్ యాక్షన్ సినిమా తమ్ముడు థియేటర్లోకి వస్తుంది. సినిమా రిసల్ట్ ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే తొలి మూడు రోజులు థియేటర్లు అయితే కళకళలాడతాయి. ఆ తర్వాత జులై 11న అనుష్క ఘాటి ఉంది. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 24న వస్తోంది. ఆ వెంటనే విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే జూలై చివరి వరకు టాలీవుడ్ లో థియేటర్లు కళకళలాడనున్నాయి. మరి ఈ సినిమాలు సూపర్ హిట్ అయితే ఆగస్టు చివరి వారం వరకు థియేటర్లకు మంచి ఫీడింగ్ ఉన్నట్టే..!
Gulte Telugu Telugu Political and Movie News Updates