కుబేర సూపర్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నెల రోజులుగా చప్పగా ఉన్న థియేటర్లకు ఊపునిస్తూ ఇవాళ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడేలా చేస్తోంది. ఎంత రేంజ్ అనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఎడారిలో నడిచేవాడిగా పెద్ద కూల్ డ్రింక్ దొరికినట్టుగా ఎగ్జిబిటర్లు జనాన్ని చూసి మహ సంతోషంగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా నైజాం లాంటి ప్రాంతాల్లో బుకింగ్స్ చాలా హెవీగా ఉన్నాయి. హైదరాబాద్ లో వీకెండ్ దాకా ఎనభై శాతం పైగా కనీస ఆక్యుపెన్సీ ఉంటుందని నెంబర్లు చెబుతున్నాయి. ఏపీలో స్ట్రాంగ్ రన్ వస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. కమర్షియల్ స్కేల్ కూడా పెరగనుంది.
ఇక ధనుష్ కాకుండా అందరి దృష్టి నిలిచిన పాత్ర నాగార్జునది. టైటిల్ రోల్ తనది కాకపోయినా, స్టోరీ పరంగా ఎంత ప్రాధాన్యం ఉన్నా హీరో కాదని తెలిసినా నాగ్ ఒప్పుకోవడం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. అంత స్పెషల్ ఏముంటుందనే కోణంలో ఎదురు చూశారు. సినిమా మొదలైన కాసేపటికే నాగ్ పరిచయంతో మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల మెయిన్ ట్విస్టులన్నీ ఈ క్యారెక్టర్ చుట్టే పెట్టారు. నిడివి పరంగా ధనుష్ తో సమానంగా స్పేస్ దొరికింది. అయితే పవర్ ఫుల్ ఎలివేషన్లు తగ్గడం, స్టోరీ డిమాండ్ కు తగ్గట్టు నాగార్జున పాసివ్ గా కనిపించడం లాంటి కారణాలు వీర ఫ్యాన్స్ కు కొంత అసంతృప్తి కలిగించిన వైనం కనిపించింది.
తాను కథను నమ్మి కుబేర చేశానని, అంతే తప్ప ఇమేజ్, మార్కెట్ లాంటి లెక్కలు చూసి కాదని చెప్పిన నాగార్జున తన వరకు మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ గా పూర్తి న్యాయం చేశారు. ఎడిటింగ్ వల్ల కొన్ని సీన్లు తగ్గి ఉండొచ్చేమో కానీ ఇంపార్టెన్స్ తగినంత ఇచ్చారు శేఖర్ కమ్ముల. అభిమానులు దీన్ని మెల్లగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు నాగ్ సబ్జెక్టు ఇష్టపడితే నిడివి పట్టించుకోరని గతంలో మోహన్ బాబు అధిపతి, మంచు విష్ణు కృష్ణార్జున, శ్రీకాంత్ నిన్నే ప్రేమిస్తా లాంటి క్యామియోలు తెలుగు, హిందీలో చాలానే ఉన్నాయి. కాకపోతే వాటితో కుబేర కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. నెక్స్ట్ కూలీ ఇంకే స్థాయిలో ఉంటుందో.
This post was last modified on June 21, 2025 6:28 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…