పాతిక సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న సంగీత దర్శకులకు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అంతటి దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవలే థగ్ లైఫ్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాకు ఎంత నిరాశ పరిచే సంగీతం ఇచ్చారో చూశాం. ఒకటి రెండు పాటలు కొందరు మ్యూజిక్ లవర్స్ కి నచ్చి ఉండొచ్చేమో కానీ మునుపటి మార్కు ఆయనలో లేదన్నది వాస్తవం. ఆస్కార్ సాధించిన కీరవాణి, ఇసైజ్ఞాని ఇళయరాజాది కూడా ఇంచుమించు ఇదే కథ. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం కొన్ని విషయాల్లో అవుట్ స్టాండింగ్ అనిపిస్తున్నాడు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నప్పటికి హిట్లు కొడుతున్నాడు.
తాజాగా కుబేరతో మరో సూపర్ మూవీ తన ఖాతాలో వేసుకున్నాడు దేవి. ముఖ్యంగా పాటల కన్నా ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూపించిన ఇంపాక్ట్ మాములుగా లేదు. ఫ్రెష్ గా అనిపించే సౌండ్స్ తో శేఖర్ కమ్ముల విజన్ ని ఎలివేట్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. దీని కన్నా ముందు మొన్న ఫిబ్రవరిలో తండేల్ రూపంలో మరో చార్ట్ బస్టర్ సాధించిన డిఎస్పి గత డిసెంబర్ లో పుష్ప 2 ది రూల్ తో తాను ఎంత పెద్ద రూలరో చాటి చెప్పాడు. వీటికి పూర్వం కంగువ, రత్నం నిరాశపరిచినప్పటికీ అవి తమిళ సినిమాలు. కనక పరిగణనలోకి తీసుకోలేం. టాలీవుడ్ వరకు హ్యాట్రిక్ కన్నా ముందు చేసింది వాల్తేర్ వీరయ్యనే.
ట్రాక్ రికార్డుని పట్టాలు తప్పకుండా మేనేజ్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తనకిచ్చిన బాధ్యత, రెమ్యునరేషన్ రెండింటికి న్యాయం చేకూరుస్తున్నాడు. సుకుమార్ టీమ్ సినిమాలకే బెస్ట్ ఇస్తాడని ముద్ర కూడా ఇప్పుడు లేదు. సినిమాలు ఒప్పుకునే విషయంలో తమన్ అంత దూకుడు చూపించకపోయినా ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న దేవి వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. నెక్స్ట్ లిస్టులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మోహన్ లాల్ వృషభకి సంగీతం సమకూరుస్తున్నాడు. దేవి ప్రోగ్రస్ కార్డు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
This post was last modified on June 20, 2025 9:50 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…