మనమేమో బంగారం ఇస్తుంటే వాళ్ళమో ఇత్తడి బదులు చేస్తునట్టుగా ఉంది టాలీవుడ్, కోలీవుడ్ మధ్య దర్శకుల ఎక్స్ ఛేంజ్. మన డైరెక్టర్లను తమిళ హీరోలు భలేగా పట్టేసుకుని బ్లాక్ బస్టర్లు కొట్టేస్తుంటే మనోళ్లు డిజాస్టర్లు కోరి మరీ తెచ్చుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా విడుదలైన కుబేరకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ అడ్వాన్స్ బుకింగ్స్ ముందు ఆశించిన స్థాయిలో లేవు. ఎందుకంటే శేఖర్ కమ్ముల అక్కడి జనాలకు అంతగా పరిచయం లేని బాపతు కావడం. కట్ చేస్తే ధనుష్ లోని బెస్ట్ పెర్ఫార్మర్ ని బయటికి తీయడమే కాక థియేటర్లకు జనాలు వచ్చే హిట్ ఇచ్చాడు.
ఇదే ధనుష్ గతంలో సార్ రూపంలో మరో హిట్టు అందుకుంది కూడా మన వెంకీ అట్లూరితోనే. దుల్కర్ సల్మాన్ కు తిరుగు లేని బ్లాక్ బస్టర్ ఇచ్చింది, ఇప్పుడు సూర్య 47 చేస్తుంది కూడా ఇతనే. గతంలో కార్తీ, నాగార్జునతో తోలా (ఊపిరి) తీసిన వంశీ పైడిపల్లి ఇక్కడి నుంచి వెళ్లినవాడే. తర్వాత విజయ్ తో వారిసు (వారసుడు) చేసే రేంజ్ కి ఎదిగాడు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన సంగతి చూద్దాం. శంకర్ ని నమ్మి గేమ్ చేంజర్ చేసిన రామ్ చరణ్ కు మర్చిపోలేని పీడకల మిగిలింది. వెంకట్ ప్రభుని గుడ్డిగా ఫాలో అయినందుకు నాగ చైతన్యకు కస్టడీ రూపంలో సులభంగా మర్చిపోలేని సూపర్ ఫ్లాప్ పడింది.
అంతకు ముందు మురుగదాస్ ని బ్లైండ్ గా నమ్మేయడం వల్ల మహేష్ బాబుకి దక్కిన స్పైడర్ ని ఫ్యాన్స్ కలలో కూడా తలుచుకోరు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ది వారియర్ దర్శకుడు లింగుస్వామి ఎక్కడివాడో వేరే చెప్పనవసరం లేదు. కోలీవుడ్ హీరోలు చాలా తెలివిగా ఎంపికలు చేసుకుంటుండగా మనోళ్లు మాత్రం కేవలం బ్రాండ్లు కాంబినేషన్లు నమ్మి మోసపోతున్న దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ఖుషి, తొలిప్రేమ లాంటివి తీసింది ఇదే తమిళ దర్శకులు కావొచ్చు. కానీ ఇప్పుడలాంటి ఫలితాలు రిపీట్ కావడం లేదు. మనమేమో ఖరీదైన కూల్ కేకులు ఇస్తుంటే వాళ్ళు మాత్రం కరెంటు షాకులు ఇస్తున్నారు.
This post was last modified on June 20, 2025 8:30 pm
ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం.…
హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత…
జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తమిళనాడులో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తుండగా ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్…
రణబాలి క్రమంగా నెమ్మదిస్తోంది. ఇప్పటిదాకా దసరా సెలవులు, రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ ఆయిన విజయ్ దేవరకొండకు వరస…
హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ ఎంచుకున్న సినిమాల్లో మిరాయ్ కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో…
https://youtu.be/GBEMMz7D6C8?si=HbG0xf2skHBR-huG 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన…