మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘కుబేర’ సినిమా. తనకే సొంతమైన ప్రత్యేక శైలిలో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల.. కెరీర్లో తొలిసారి ఒక హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా తీశాడు. తమిళ నటుడు ధనుష్‌ను హీరోగా పెట్టడం, అక్కినేని నాగార్జునతో ప్రత్యేక పాత్ర చేయించడం.. రష్మికను కథానాయికగా ఎంచుకోవడం.. దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీతం చేయించుకోవడం.. ఇలా సినిమాకు సంబంధించి ప్రతిదీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇటు శేఖర్, అటు ధనుష్.. వీళ్లిద్దరి కెరీర్లోనూ అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది.
మొదలైనపుడు మీడియం రేంజే అనుకున్నారు కానీ.. సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ రూ.150 కోట్లకు చేరిపోయింది. డిజిటల్ హక్కులు రూ.47 కోట్లు తెచ్చిపెట్టినట్లు నిర్మాత సునీల్ నారంగ్‌యే స్వయంగా వెల్లడించారు. మిగతా హక్కుల ద్వారా రూ.100 కోట్ల దాకా రావాల్సి ఉంది. మిగతా హక్కుల సంగతి ఏమో కానీ.. ‘కుబేర’ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.65 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఈ సినిమా రూ.120 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.33 కోట్లు పలికాయి. తమిళనాడు రైట్స్ రూ.20 కోట్లకు అమ్మారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా రూ.6 కోట్ల దాకా వచ్చాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.8.5 కోట్లు పలికినట్లు సమాచారం.
మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.65 కోట్లకు అటు ఇటుగా అయింది. ఈ మేరకు షేర్ రావాలంటే గ్రాస్ రూ.120 కోట్లు దాటాలి. ప్రి రిలీజ్ హైప్ అయితే మరీ ఎక్కువేమీ లేదు. తమిళనాట ధనుష్ పెద్ద స్టారే అయినా ఈ సినిమాకు బిజినెస్ అనుకున్నంతగా జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డల్లుగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో స్పందన బాగానే ఉంది. సినిమాకు మంచి టాక్ రావడం చాలా కీలకం. టీం అయితే రిలీజ్ తర్వాత స్పందన చాలా బాగుంటుందని.. ఇటు తెలుగులో, అటు తమిళంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని.. బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తుందని ధీమాగా ఉంది.
This post was last modified on June 19, 2025 3:35 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…