తెలుగులో కొంత విరామం తర్వాత రాబోతున్న పెద్ద సినిమా.. కుబేర. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ ఇందులో లీడ్ రోల్ చేయగా.. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రను పోషించారు. ఇప్పటిదాకా కెరీర్లో చాలా వరకు సెన్సిబుల్ లవ్ స్టోరీలే తీసిన శేఖర్ కమ్ముల.. ఈసారి చాలా సీరియస్‌గా సాగే ఒక బిచ్చగాడి కథను చెప్పాలనుకోవడం ఆశ్చర్యమే. ‘కుబేర’ టీజర్, ట్రైలర్ చూస్తే ఆ సినిమా కథ మీద ఒక అంచనాకు రాలేని పరిస్థితి. ఈ సినిమా స్టోరీ ఏంటి అంటూ కమ్ములను విలేకరులు అడగ్గా.. స్పాయిలర్స్ లేకుండా సింపుల్‌గా ఈ సినిమా లైన్ ఏంటో చెప్పాడు. అసలీ కథ ఎలా పుట్టిందో కూడా వివరించే ప్రయత్నం చేశాడు. ‘కుబేర’ చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారని కూడా కమ్ముల ధీమా వ్యక్తం చేశాడు.
‘‘నేను ఏదో ఆలోచిస్తున్నపుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడికి, ఏమీ లేని పేదవాడికి మధ్య జరిగిన పోరాటాన్ని ఒక సినిమాగా చూపించాలని అనిపించింది. నిజానికి ఇది చాలా పెద్ద పాయింట్. కథగా చెప్పడం కష్టం. దాన్ని జాగ్రత్తగా రాసుకుని తెరపైకి తీసుకొచ్చా. ఒక్క మాటలో చెప్పాలంటే బిలియనీర్ వెర్సస్ బెగ్గర్ కథే కుబేర. ఈ రెండు భిన్న ప్రపంచాల మధ్య కనెక్షన్ ఏంటన్నది తెర మీదే చూడాలి. మీరెప్పుడూ చూడనిది చూస్తే ఎలా షాకవుతారో.. ఈ సినిమా చూసినపుడు కూడా అలాగే ఆశ్చర్యపోతారు. ‘వావ్.. ఇదేం చిత్రంరా’ అనిపించేలా ఉంటుంది’’ అని కమ్ముల చెప్పాడు.
ఇక 25 ఏళ్ల కెరీర్లో పది సినిమాలు మాత్రమే చేయడం గురించి కమ్ముల స్పందిస్తూ.. వేరే వాళ్లకు ఇది తక్కువ అనిపిస్తుందేమో కానీ, తనకు మాత్రం చాలా ఎక్కువ అని వ్యాఖ్యానించడం విశేషం. తక్కువ సినిమాలు చేశాననే బాధ ఎంతమాత్రం లేదని కమ్ముల చెప్పాడు. తన సినిమాల విషయంలో ఎప్పుడూ లాభాల్లో వాటా కావాలని అడగలేదని.. తనకింత పారితోషకం ఇవ్వాలని మాత్రమే తీసుకున్నానని.. దాని వల్ల చాలా నష్టపోయానని.. అయినా ఏ విషయంలోనూ తనకు బాధ లేదని.. అన్నింటికంటే ప్రేక్షకుల ప్రేమ తనకు ముఖ్యమని శేఖర్ స్పష్టం చేశాడు.
This post was last modified on June 19, 2025 2:37 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…