విశ్వంభరకు షూటింగ్ పరంగా బ్యాలన్స్ ఉన్నది ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే. దానికి సరైన హీరోయిన్ దొరక్క దర్శకుడు వశిష్ఠ పెద్ద కసరత్తే చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. విఎఫ్ఎక్స్ పనులు, రిలీజ్ డేట్ ఇంకా నిర్ధారణ చేయకపోవడం వల్ల టీమ్ అయితే ఒత్తిడిలో ఉంది. ఇదిలా ఉండగా కీరవాణి స్వరపరిచిన ఈ పాట చిరంజీవిని అంత సంతృప్తి పరచలేకపోయిందనే టాక్ గతంలోనే వచ్చింది. కొత్త ట్యూన్లు ట్రై చేశారట కానీ అవేవి అంత కిక్ ఇవ్వకపోవడంతో ఇప్పుడా బాధ్యతను భీమ్స్ కి ఇచ్చారని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా సమాచారం లేదు కానీ అంతర్గతంగా ఓకే అయ్యిందని, త్వరలోనే రికార్డింగ్ ఉంటుందని అంటున్నారు.
ఇలా ఎందుకు జరిగిందనే బ్యాక్ స్టోరీ చూద్దాం. కీరవాణి ప్రస్తుతం హరిహర వీరమల్లు రీ రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. దానికి బీజీఎమ్ ఇవ్వాలి. జూలైలోనే రిలీజ్ అంటున్నారు కాబట్టి క్వాలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ పరిస్థితిలో విశ్వంభర కోసం టైం కేటాయించడం కష్టం. అందుకే భీమ్స్ తెరపైకి వచ్చాడని అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157కి అతను ఇచ్చిన పాటలకు బాగా ఇంప్రెస్ అయిన చిరంజీవి స్వయంగా రికమండేషన్ చేశారని అంటున్నారు. ఎంత వరకు నిజమనేది ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చు.
సరైన అప్డేట్స్ లేక ఇప్పటికీ బజ్ విషయంలో వెనుకబడిన విశ్వంభర అర్జెంట్ గా ప్రమోషన్ల వేగం పెంచాలి. గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ తర్వాత పబ్లిసిటీ ఒక్కసారిగా సైలెంట్ కావడం మెగాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత ఆలస్యం చేయడం వల్ల క్రేజ్ తగ్గిపోతోందని వాపోతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో గొప్ప ఫాంటసీ మూవీ ఇస్తానని హామీ ఇచ్చిన వశిష్ట బయట కనిపించడమే మానేశాడు. మెగా 157 ఆల్రెడీ రెండో షెడ్యూల్ మొదలుపెట్టేసుకుంది. చూస్తూ ఉంటే సంక్రాంతికి పండగ వచ్చేసి రావిపూడి సినిమానే ముందు రిలీజవుతుందేమోనని ఫ్యాన్సే పంచులేస్తున్నారు.
This post was last modified on June 18, 2025 9:43 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…