ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న కుబేర మీద అంచనాలు ఎగబాకుతున్నాయి. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా హైప్ విషయంలో బాగా ఉపయోగపడుతోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల టిపికల్ స్టైల్ కనిపించినప్పటికీ ఆయన ఫాలో అయ్యే సాఫ్ట్ ఫార్ములా కాకుండా సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ కావడం ఆసక్తి రేపుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. బుక్ మై షో కదలికలు గమనిస్తే తమిళ వెర్షన్ కన్నా తెలుగు అమ్మకాలే వేగంగా ఉండటం గమనార్హం. హైదరాబాద్ ప్రముఖ మల్టీప్లెక్సుల్లో మొదటి రోజు షోలు దాదాపు ఫుల్ అవుతున్న వైనం కనిపిస్తోంది.
దీనికి కారణాలు లేకపోలేదు. తమిళ ఆడియన్స్ కుబేరని తెలుగు సినిమాగానే చూస్తున్నారు. బై లింగ్వల్ అయినప్పటికీ శేఖర్ కమ్ముల, నాగార్జున, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న లాంటి పేర్లు ఆ ఫ్లేవర్ తీసుకొస్తున్నాయి. పైగా ట్రైలర్ సైతం మన నేటివిటీలోనే ఉందని వాళ్ళ ఫీలింగ్. గతంలో సార్ సైతం ఇదే తరహా స్పందన తెచ్చుకోవడం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయితే అక్కడ జస్ట్ హిట్ అనిపించుకుంది. కుబేర సైతం అదే కోవలోకి చేరొచ్చని ట్రేడ్ అంచనా. రెండు మూడు వారాలుగా విపరీతమైన డ్రైతో ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పొసే బాధ్యత ఇప్పుడు కుబేర మీదే ఉంది.
కుబేరకు తమిళం కన్నా తెలుగులోనే బేరాలు బాగుండటం మంచి విషయమే. టాక్ కనక బాగా వస్తే కనీసం రెండు మూడు వారాలు స్ట్రాంగ్ గా నిలిచేందుకు అవకాశం దొరుకుతుంది. జూన్ 27 కన్నప్ప, జూలై 4 తమ్ముడు ఉన్నప్పటికీ కుబేర కనక యునానిమస్ అనిపించుకుంటే కాంపిటీషన్ పరంగా పెద్దగా టెన్షన్ ఉండదు. కాకపోతే నార్త్ సైడ్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ వల్ల కుబేర బుకింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అవి మరీ తీవ్రంగా కాకపోవడం ఊరట కలిగిస్తోంది. కాకపోతే మూడు గంటలకు పైగా నిడివి ఉన్న కుబేర అంతసేపు ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేస్తాడో చూడాలి. నిర్మాతలు మాత్రం ధీమాగా ఉన్నారు.
This post was last modified on June 17, 2025 10:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…