మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత గ్యాప్ తీసుకున్న అనుష్క కొత్త సినిమా ఘాటీ ఏప్రిల్ 18 నుంచి తప్పుకున్నాక కొత్త డేట్ జూలై 11 తీసుకుంది. ఇప్పుడు చేతిలో నెల రోజులు లేకపోయినా ఇంకా ప్రమోషన్లు మొదలు కాకపోవడం ఫ్యాన్స్ లో అనుమానాలు రేపుతోంది. అదే తేదీకి సుహాస్ ఓ భామ అయ్యో రామాని రిలీజ్ చేయడం చూస్తుంటే స్వీటీ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందేమోనని డౌట్ రావడం సహజం. యువి క్రియేషన్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ లేడీ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అనుష్క గంజాయి డాన్ గా నటిస్తోంది. ఇప్పటిదాకా ఇంట్రో టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ వదల్లేదు.
ఈ మౌనం వెనుక కొన్ని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఘాటీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు. పనులైతే జరుగుతున్నాయి. క్రిష్ బయటికి కనిపించకపోవడానికి కారణం ఇదే. అయితే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాని నేపథ్యంలో రెండింటి మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలనేది ఘాటీ నిర్మాతల ఆలోచన. ఇంకోవైపు ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాల ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది. థియేటర్ రిలీజ్ డేట్లు ఫైనల్ చేసే విషయంలో ప్రైమ్ షెడ్యూల్స్ కీలకం కాబోతున్నాయి. ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడే ఘాటీ జూన్ 11 తీసుకుందనేది అంతర్గత వర్గాల సమాచారం.
ఒకవేళ అదే డేట్ కి కట్టుబడితే మాత్రం వీలైనంత త్వరగా పబ్లిసిటీ మొదలుపెట్టాలి. అనుష్క ఈసారైనా బయటికి వస్తుందో లేదోననేది ఆసక్తికరంగా మారింది. యువి నిర్మిస్తున్న విశ్వంభర సైతం ఇదే తరహా డోలాయమానంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఘాటీకి అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ సమస్య లేనప్పటికీ ఎందుకు లేట్ అవుతోందనేది అర్థం కానీ ప్రశ్న. బడ్జెట్ ఎక్కువున్నా తక్కువున్నా పేరున్న హీరో హీరోయిన్లు నటించిన సినిమాలకు వాయిదాల పర్వం పరిపాటిగా మారింది. ఘాటీ తర్వాత అనుష్క నటించిన మరో మలయాళం మూవీ కథనర్ కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. ఇది కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోని బాపతే.
This post was last modified on June 17, 2025 9:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…