ఇప్పుడంతా సీక్వెల్స్ ట్రెండ్. ఒకప్పుడు టాలీవుడ్ లో పార్ట్ 2 అనే మాట ఉండేది కాదు. మనీతో రామ్ గోపాల్ వర్మ లాంటి నిర్మాతలు ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా ఫలితాలు దక్కలేదు. కానీ బాహుబలి మొత్తం మార్చేసింది. కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ కొనసాగింపు జ్వరం అంటించింది. ఇది ఏ స్థాయిలో ఉందంటే రెండో భాగం కోసం సంవత్సరాల తరబడి ఖర్చు పెడుతున్న స్టార్ హీరోలు చాలా ఉన్నారు. కెజిఎఫ్ కోసం యష్ తీసుకున్న గ్యాప్ చిన్నది కాదు. పుష్ప సిరీస్ కోసం అల్లు అర్జున్ వెచ్చించిన సమయం అక్షరాలా అయిదు సంవత్సరాలు. అఫ్కోర్స్ దానికి తగ్గ గొప్ప ఫలితం అందుకోవడం వేరే విషయం.
కానీ ప్రభాస్ మాత్రం సీక్వెల్స్ వెంటపడను అంటున్నాడు. ఇప్పటిదాకా సలార్ 2 శౌర్యంగపర్వం ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఇతర నటీనటులు ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు కానీ డార్లింగ్ మాత్రం కొత్త కథల వైపు మొగ్గు చూపుతున్నాడు. కల్కి 2 కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్ధంగా ఉన్నా ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది ప్రభాస్ డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ది రాజా సాబ్ సింగల్ పార్ట్ ఉంటుందని, బలవంతంగా సీక్వెల్ రుద్దమని దర్శకుడు మారుతీ డైరెక్ట్ గా సంకేతం ఇచ్చాడు. ఫౌజీకి కంటిన్యూయెషన్ ఉండదు ప్రశాంత్ వర్మ తీయబోయే ప్యాన్ ఇండియా మూవీ, సందీప్ వంగా స్పిరిట్ సైతం సింగల్ పార్టని ఇన్ సైడ్ టాక్.
ఏది ఏమైనా ప్రభాస్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అభిమానులు, ప్రేక్షకులు ఫ్రెష్ సబ్జెక్టుల్లో తమ హీరోని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇవేవి కాకుండా కేవలం సలార్ 2నే స్టార్ట్ అయ్యుంటే ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ కి మిగిలినవి అసలు స్టార్ట్ అయ్యేవి కాదు. బాహుబలికి అయిదేళ్ళు ఖర్చు చేసిన ప్రభాస్ మళ్ళీ అలా జరిగేందుకు అవకాశం ఇవ్వడం లేదు. కొత్త కథలు వింటున్నాడు. డైరెక్టర్లు వస్తామంటే రమ్మంటున్నాడు. చూస్తుంటే పెండింగ్ లో ఉన్న సీక్వెల్స్ సెట్స్ మీద వెళ్ళడానికి ఇంకో ఆరేడు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఆలోపు ప్రేక్షకులు వాటిని మర్చిపోయినా పర్లేదనుకునే రేంజ్ దాటేశాడు ప్రభాస్.
This post was last modified on June 17, 2025 9:15 pm
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…