Movie News

థ‌గ్‌లైఫ్‌ క‌ర్ణాట‌క‌ విడుదలపై సుప్రీం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విశ్వ‌నటుడు క‌మ‌ల్ హాస‌న్‌, ద‌ర్శ‌క దిగ్గ‌జం మ‌ణిర‌త్నంల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `థ‌గ్‌లైఫ్` సినిమాపై సుప్రీంకోర్టు సంచల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ సినిమాను అడ్డుకునే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. క‌ర్ణాట‌క‌లోని భాషా సంఘాలు హ‌ద్దు మీరుతున్నాయ‌ని భావిస్తే.. త‌క్ష‌ణ‌మే ఆయా సంఘాల నాయ‌కుల‌పై బ‌ల‌మైన క్రిమిన‌ల్ చ‌ట్టాల‌తోపాటు.. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్నార‌న్న సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఈ సినిమాను క‌ర్ణాట‌క‌లో ఎవ‌రూ ఆప‌రాద‌ని కూడా తేల్చి చెప్పింది.

అస‌లు ఏం జ‌రిగింది?

థ‌గ్ లైఫ్ సినిమా నిర్మాణం త‌ర్వాత‌.. దీని ప్ర‌మోష‌న్ లో భాగంగా క‌మ‌ల్ హాస‌న్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కన్న‌డ భాషపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌న్న‌డం త‌మిళం నుంచే పుట్టిందన్నారు. దీంతో భాషా ప‌ర‌మైన వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఏకంగా క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య స్పందించారు. క‌మ‌ల్‌కు ప‌రిజ్ఞానం లేద‌న్నారు. ఇక‌, భాషా సంఘాలు తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోశాయి. త‌ర్వాత‌.. హైకోర్టును ఆశ్ర‌యించాయి.

దీంతో వివాదం ముదిరింది. క‌మ‌ల్ క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌రిపోతుంద‌ని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. అయితే.. సారీ చెప్పేందుకు క‌మ‌ల్ నిరాక‌రించారు. దీంతో ఈ సినిమాను క‌ర్ణాట‌క‌లో ఆడ‌నిచ్చేది లేద‌ని క‌న్న‌డ భాషా సంఘాలు తేల్చిచెప్పాయి. దీంతో క‌మ‌ల్‌ కూడా..  ఈ సినిమాను క‌ర్ణాట‌క‌లో త‌ప్ప అన్ని చోట్లా విడుద‌ల చేస్తామ‌న్నారు. అయితే.. రాజ్‌క‌మ‌ల్ మూవీ సిబ్బంది(క‌మ‌ల్ కు చెందిన సంస్థే) సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

క‌ర్నాటక భాషా సంఘాలు థ‌గ్‌లైఫ్ సినిమాను అడ్డుకుంటున్నాయ‌ని.. ఇది భావ‌ప్ర‌క‌ట‌నాస్వేచ్ఛ‌కు, జీవించే హ‌క్కుకు(ఈ సినిమా ద్వారా కొన్ని వేల మంది ఆధాప‌డి ఉండ‌డం) విఘాత‌మ‌ని పేర్కొన్నారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు.. తాజాగా కీల‌క ఆదేశాలు చేసింది. ఏదైనా ఉంటే మాట‌ల ద్వారా తేల్చుకోవాలని.. సెన్సార్ బోర్డు ఒక్క‌సారి స‌ర్టిఫికెట్ ఇచ్చిన త‌ర్వాత‌.. ఎక్క‌డైనా ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించే హ‌క్కు నిర్మాణ సంస్థ‌కు ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. యాగీ చేస్తే.. తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని పేర్కొంది.

This post was last modified on June 17, 2025 6:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

54 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago