ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలకు పైరసీ పెద్ద బెడదగా మారిపోయింది. రిలీజ్ రోజు మధ్యాన్నానికే మంచి హెచ్డి ప్రింట్లు రావడం పట్ల నిర్మాతలు పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. దీనికో పరిష్కారం కనుక్కునే దిశగా కొత్త మార్గాలు వెతుకుతున్నారు. వాటిలో ఇన్సూరెన్స్ చేయించడం గురించి బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ముంబై మీడియా ప్రకారం సల్మాన్ ఖాన్ సికందర్ నిర్మాణ సంస్థ తమ చిత్రం పైరసీ బారిన పడటం వల్ల జరిగిన నష్టానికి గాను తొంభై కోట్ల క్లెయిమ్ ని కోరే ఆలోచనలో ఉందట. ముందు రోజు రాత్రే ఈ మూవీ తాలూకు ఒరిజినల్ వెర్షన్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
ఇది మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. ఎందుకంటే పైరసీ ప్రమాదాన్ని ముందే గుర్తించి ఇన్సూరెన్స్ చేయించినా సదరు కంపెనీలు గుడ్డిగా సొమ్ములు చెల్లించవు. లోతైన పరిశీలన చేస్తాయి. నిర్మాత స్వంత ప్రాపర్టీ అయిన సినిమా అసలు బయటికి ఎలా వచ్చిందనే దాని మీద విచారణ కోరతారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్, సినిమా మీదున్న అంచనాలు, బిజినెస్ తాలూకు ఆధారాలు, బుక్ మై షో ట్రెండింగ్ గట్రా వ్యవహారాలు ఇలా రకరకాల ఆడిట్లను చేయించి ప్రొడ్యూసర్ తప్పేమి లేకుండానే డ్యామేజ్ జరిగిందని తేలితే అప్పుడు క్లెయిమ్ ఇస్తారు.
ప్రస్తుతానికి సికందర్ బృందం ఇంకా ఇన్సూరెన్స్ కోసం అప్పీల్ చేయలేదు కానీ ప్రతిపాదన మాత్రం సీరియస్ గా ఉందట. ఏదైనా విపత్తు జరిగినప్పుడు కాంపెన్సేషన్ డిమాండ్ చేయడం సబబే కానీ ఇలా ఇంటి దొంగలు ఎక్కువగా ఉండే పైరసీ లాంటి సమస్యలకు పరిష్కారం అంత సులభంగా ఉండదు. తెలుగులో గేమ్ చేంజర్ దీని వల్ల ఎంత దారుణంగా దెబ్బ తిందో ఫ్యాన్స్ మర్చిపోలేరు. తండేల్ పైరసీని ఆపేందుకు నిర్మాత బన్నీ వాస్ ఎంత ప్రయత్నించినా కట్టడి చేయలేకపోయారు. భవిష్యత్తులో ఇలా ఇన్సూరెన్స్ మీద ఆధారపడే అవసరం రాకుండా సరైన దిశగా చర్యలు తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి.
This post was last modified on June 17, 2025 2:28 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…