Movie News

ప్యారడైజ్ లక్ష్యానికి అనుకోని బ్రేకులు

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ది ప్యారడైజ్ ముందు లాక్ చేసుకున్న విడుదల తేదీ మార్చ్ 26. ఒక రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్ది వస్తున్నా సరే వెనక్కు తగ్గకూడదని తొలుత నిర్ణయించుకున్నారు. కానీ తాజా పరిణామాలు ప్యారడైజ్ కు బ్రేక్స్ లా మారుతున్నాయని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగినప్పటికీ ఇంకొందరు కీలక ఆర్టిస్టుల డేట్లు అందుబాటులో లేకపోవడంతో పాటు సెట్ వర్క్ మరింత మెరుగు పరచాలనే ఉద్దేశంతో చిన్నవిరామం ఇచ్చారని, తిరిగి జూలై లేదా ఆగస్ట్ లో పునఃప్రారంభమవుతుందని అంతర్గత సమాచారం.

ఒకవేళ ఇది నిజమైతే ప్యారడైజ్ మార్చ్ లో రావడం కష్టం. వేసవికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వేగంగా తీయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిస్థితులు దానికి సహకరించడం లేదని వినికిడి. నాని కూడా ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా పూర్తిగా దీనికే అంకితమవుతున్నాడు. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇంకా ఓటిటి డీల్ కాలేదని తెలిసింది. నెట్ ఫ్లిక్స్ రెడీగా ఉన్నా రేట్ విషయంలో కంక్లూజన్ కు రాలేదని అంటున్నారు. చాలా ముఖ్యమైన పాత్రకు మోహన్ బాబుని తీసుకున్నారనే వార్త కూడా అధికారిక ధృవీకరణ దక్కించుకోలేదు. నెలల తరబడి ఇది గాసిప్ గానే ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే భారీ పొటెన్షియల్ ఉన్న పెద్ది, ది ప్యారడైజ్ లు క్లాష్ లేకుండా సోలోగా రావడమే మంచిది. ఒకపక్క పెద్దిని దర్శకుడు బుచ్చిబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు ఎక్కువ సమయం దొరికేలా చూసుకుంటున్నారు. హైప్ పరంగా చూస్తే దీని మీద విపరీతమైన బజ్ వచ్చేసింది. ఇక నాని సంగతికొస్తే హిట్ 3 ఎంత హిట్టయినా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. ది ప్యారడైజ్ మాత్రం అంచనాలకు పదింతలు మించిన కంటెంట్ తో ఉంటుందని, నాని కెరీర్ బెస్ట్ అవుతుందని యూనిట్ నుంచి కాన్ఫిడెంట్ గా వినిపిస్తున్న మాట.

This post was last modified on June 17, 2025 10:48 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

46 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

1 hour ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

8 hours ago