Movie News

మూడు గంటలు సేఫ్ గేమే

ది రాజా సాబ్ టీజర్ అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చేసింది. సోషల్ మీడియాలో అధిక శాతం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుండగా విఎఫ్ఎక్స్ మీద కామెంట్స్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా దర్శకుడు మారుతీ నుంచి ఆశించిన దానికన్నా బెటర్ అవుట్ ఫుట్ కనిపించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు కొంత నెగటివిటీ వచ్చింది. హిట్టు దర్శకులు వెంటపడుతుంటే ప్లాప్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్కెఎన్ అన్నట్టు ఇవన్నీ దాదాపు తీరినట్టేనని చెప్పొచ్చు. రిలీజ్ ఇంకా దూరం ఉంది కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.

ఇదిలా ఉండగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ ది రాజా సాబ్ మూడున్నర గంటలు ఉంటుందని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హాలీవుడ్ కు ఈ సినిమా తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఇంత నిడివి అక్కడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూసుకోవాలనే రీతిలో సంకేతం ఇచ్చాడు. డిస్నీ లాంటి మూవీస్ మనమూ తీయగలమని రాజా సాబ్ నిరూపిస్తుందని అన్నారు. తర్వాత మళ్ళీ క్లారిటీ ఇస్తూ అదేదో ఫ్లోలో అన్నానని రాజా సాబ్ మూడు గంటలే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. సో ఓవర్ లెన్త్ ఆందోళన లేనట్టే.

అయినా కంటెంట్ బాగుంటే ఎంతసేపు థియేటర్ లో కూర్చున్నామనేది ప్రేక్షకులు లెక్కచేయలేరని పుష్ప 2 నిరూపించింది. కాకపోతే రాజా సాబ్ హారర్ కామెడీ డ్రామా. యాక్షన్ ఎలిమెంట్స్, పాటలు, ఇతర అంశాలు ఎన్ని ఉన్నా దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో మరీ ఎక్కువ కంటెంట్ ఉంటే అనుమానాలు రావడం సహజం. కానీ టాలీవుడ్ ఆడియన్స్ కు ఆ బెంగ అక్కర్లేదు. బొమ్మ నచ్చితే ఇవేవి పట్టించుకోరు. అయితే ఇంకా ఫైనల్ వెర్షన్ లాక్ చేయలేదు కాబట్టి  అప్పుడే దీని గురించి నిర్ధారణగా చెప్పలేం కానీ రాజా సాబ్ కు సంబంధించి పార్ట్ 2 ఉండదని, బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయమని మారుతీ చెప్పడం గమనార్షం.

This post was last modified on June 16, 2025 3:02 pm

Share

Recent Posts

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

18 minutes ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

34 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

60 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

2 hours ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago