వెబ్ సిరీస్ ట్రెండ్‌ను బాలీవుడ్ చాలా ముందుగా అడాప్ట్ చేసుకుంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్.. ఇలా పెద్ద పెద్ద తారలు వెబ్ సిరీస్‌లు చేశారు. కానీ సౌత్‌లో మాత్రం స్టార్ హీరోలు అటు వైపే చూడలేదు. ఇక్కడ తెరకెక్కిన వెబ్ సిరీస్‌లే తక్కువ అంటే.. స్టార్లు అసలే నటించలేదు. కానీ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రం ధైర్యం చేసి రెండేళ్ల ముందు అడుగు ముందుకు వేశారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ‘రానా నాయుడు’ సిరీస్ చేశారు. దీన్ని పాన్ ఇండియా సిరీస్‌గా చెప్పుకోవచ్చు.
హాలీవుడ్ టీవీ షో ‘రే డొనోవన్’ ఆధారంగా నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను రూపొందించింది. కానీ తొలి సీజన్ చూసిన వెంకీ అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. వెంకీ నోట వచ్చిన బూతు డైలాగులు.. సినిమాలో శ్రుతి మించిన శృంగార సన్నివేశాలు చూసి ఆయన ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. కొన్ని సీన్లు చూసి తట్టుకోలేక.. సిరీస్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిన వాళ్లు చాలామందే ఉంటారు. నిజానికి సీజన్-1 ఇంట్రెస్టింగ్‌గా సాగినా.. వల్గారిటీ ఎక్కువనే కారణంతోనే మన వాళ్లు దాన్ని అంతగా ఆదరించలేదు.
ఇప్పుడిక సీజన్-2 వచ్చింది. ఫస్ట్ సీజన్ ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని బూతులు, బోల్డ్ సీన్ల డోస్ తగ్గించారు. ఉన్నంతలో కొంచెం నీట్‌గానే సిరీస్ తీశారు. కానీ ఈసారి కంటెంట్ మరీ వీకైపోయింది. ముఖ్యంగా వెంకీ పాత్రను అయితే మేకర్స్ తేల్చిపడేశారు. ఓవరాల్‌గా సిరీస్ వీక్ అయినా.. రానా పాత్ర బాగానే హైలైట్ అయింది. తన పాత్ర బాగుంది. కానీ వెంకీ పాత్ర మాత్రం కూరలో కరివేపాకులా తయారైంది.
ఇందులో వెంకీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు చేశారు. కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో వెంకీ కూడా మొక్కుబడిగా నటించినట్లు అనిపిస్తుంది. ఆయన లుక్ కూడా కృత్రిమంగా అనిపించి.. అంతగా ఆకట్టుకోలేదు. ఇంకో సీజన్ పూర్తి చేయాలి కాబట్టి వెంకీ మమ అనిపించినట్లున్నాడు. మొత్తంగా వెంకీ డిజిటల్ ఎంట్రీ ఆయనతో పాటు అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలేలా ఉంది.
This post was last modified on June 14, 2025 11:11 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…