సరిగ్గా ఆరు నెలల క్రితం పుష్ప 2 కి సంబంధించి సంధ్య థియేటర్ దుర్ఘటన వల్ల పోలీసు కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడిన అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డుల వేడుక ఒక అరుదైన జ్ఞాపకంగా నిలిచిపోనుంది. చట్టప్రకారమే చర్యలు తీసుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం ద్వారా అయితే తాను న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడదే తెలంగాణ సర్కారు ప్రకటించిన గద్దర్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకోవడం బన్నీ కన్నా ఎక్కువ అభిమానులకు స్పెషల్ గా గుర్తుండి పోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద అవార్డు అందుకున్న ఐకాన్ స్టేజి వేదిక మీద మాట్లాడింది రెండు నిమిషాలే అయినా మంచి కిక్ ఇచ్చాడు.
తనకు ఈ గౌరవం దక్కేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, దర్శకుడు సుకుమార్ తో పాటు పని చేసిన ప్రతి ఒక్కరు తన విజయంలో భాగమని చెప్పిన బన్నీ సిఎం రేవంత్ రెడ్డిని అన్నా అంటూ సంబోధించడం ఆకర్షణగా నిలిచింది. డిప్యూటీ సిఎం భట్టి గారు అంటూ ఆయనతో చనువుని బయటపెట్టిన బన్నీ ఇది సినిమా ఈవెంట్ కాబట్టి ఒక డైలాగు చెబుతానంటూ రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవడం ఆకట్టుకుంది. పుష్ప 2 క్లైమాక్స్ లో వచ్చే రప్పా రప్పా సంభాషణను అదే గంభీరతతో పలుకుతూ చివర్లో తగ్గేదేలా అని చెప్పడం అక్కడున్న ఆహుతులతో చప్పట్లు కొట్టించేలా చేసింది. మధ్యలో రాజమౌళికి థాంక్స్ చెప్పాడు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే థాంక్ యు, తగ్గేదేలే అంటూ రెండూ తన స్పీచ్ లో పొందుపరిచిన అల్లు అర్జున్ అందులో వేరే ఉద్దేశాలు ఏవీ లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం భలే హ్యాపీగా ఫీలవుతున్నారు. పడ్డ చోటే గెలవడమంటే ఇదేనంటూ దీని తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ముంబై షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఈ ఫంక్షన్ కోసం బ్రేక్ తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. మొదటిసారి పునఃప్రవేశ పెట్టిన అవార్డులు కావడంతో విజేతలు అందరూ విచ్చేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్లు మిస్ కావడం కొంత లోటే అయినా వేడుక ఘనంగా జరిగింది.
This post was last modified on June 14, 2025 10:53 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…