Movie News

‘క్రాక్‌’కు రిపేర్లు చేస్తున్నారా?

మాస్ రాజా రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా ‘క్రాక్’. చాలా ఏళ్లుగా ఆయనకి సరైన విజయం లేదు. చివరగా మాస్ రాజా నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వల్ల ప్రయోగాలు అవ్వవని ఫిక్సయిపోయి అలవాటైన మాస్ సినిమాల్లోకి దిగిపోయాడు రవితేజ. పూర్తిగా మాస్ రాజా స్టయిల్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘క్రాక్’. ఇంతకుముందు రవితేజకు డాన్ శీను, బలుపు లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కరోనా విరామం మధ్య నెల కిందటే షూటింగ్ పున:ప్రారంభించారు. టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి చేశారు. కానీ అంతా అయ్యాక ఒకసారి రషెస్ చూసుకుంటే కొన్ని సన్నివేశాలు అనుకున్నంత ఎఫెక్టివ్‌గా లేరని భావించిందట చిత్ర బృందం.

రవితేజకు ఈ సినిమా హిట్టవడం అత్యావశ్యకం కావడంతో సంతృప్తికరంగా లేని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఫిక్సయ్యారట. ఒంగోలు ప్రాంతంలో ఆ సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఆ సీన్లన్నీ పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్లిపోతారని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రీషూట్లు అంటే దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావించేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి కొన్ని సినిమాలు రీషూట్లు చేసుకునే మంచి ఫలితాన్నందుకున్నాయి.

రష్ చూసుకుని కరెక్షన్లు చేసుకుంటే తప్పేమీ లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడింది. కాబట్టి ‘క్రాక్’కు రిపేర్లు జరగడాన్ని నెగెటివ్‌గా ఏమీ చూడాల్సిన పని లేదు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’ స్ఫూర్తితో తెరకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ సినిమాను ఆల్రెడీ ‘జయదేవ్’ పేరుతో రీమేక్ చేయగా.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.

This post was last modified on November 11, 2020 1:51 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

59 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

3 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

4 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

4 hours ago