కమల్ హాసన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘విక్రమ్’ సినిమాలో మిగతా ఆకర్షణలన్నీ ఒకెత్తయితే.. చివర్లో రోలెక్స్ పాత్రలో సూర్య చేసిన విధ్వంసం మరో ఎత్తు. కనిపించింది కొన్ని నిమిషాలే అయినా.. రోలెెక్స్ పాత్రలో అదరగొట్టేశాడు సూర్య. సినిమాలో కమల్‌కు దీటైన విలన్ లేడన్న చిన్న అసంతృప్త పోగొడుతూ.. మోస్ట్ వయొలెంట్ రోలెక్స్ క్యారెక్టర్లో సూర్య పాత్రను ప్రెజెంట్ చేసి.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. తన తర్వాతి చిత్రం ‘లియో’లోనూ ఇలాంటి మెరుపులను ప్రేక్షకులు ఆశించారు కానీ.. నిరాశ తప్పలేదు.
కానీ లోకేష్ కొత్త చిత్రం ‘కూలీ’లో మాత్రం క్లైమాక్స్ ట్రీట్ గట్టిగానే ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తుండడమే ప్రేక్షకులకు ఎంతో ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది. అది చాలదన్నట్లు ఇందులో ఆమిర్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్న విషయం కూడా ఖాయమైంది. స్వయంగా ఆమిరే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
‘కూలీ’లో తన పాత్ర నిడివి పరంగా చిన్నదే కానీ.. అది చాలా ముఖ్యమైన పాత్ర అని ఆమిర్ తెలిపాడు. దాని ఇంపాక్ట్ బలంగా ఉంటుందన్నాడు. సినిమా చివర్లో తన పాత్ర వస్తుందని కూడా ఆమిర్ తెలిపాడు. ఈ సినిమా కోసం తనను లోకేష్ సంప్రదించినపుడు కథేంటో కూడా తాను అడగలేదని.. రజినీకాంత్ సినిమాలో క్యామియో అనగానే సరే అనేశానని ఆమిర్ వెల్లడించాడు.
రజినీకాంత్‌కు తాను చాలా పెద్ద ఫ్యాన్ అని.. ఆయన్ని వ్యక్తిగతంగా కూడా ఎంతో ఇష్టపడతానని ఆమిర్ చెప్పాడు. ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టాక చాలా ఎంజాయ్ చేశానని.. రజినీతో పాటు లోకేష్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ లాంటి వాళ్లతో కలిసి పని చేయడం చాలా మంచి అనుభవమని ఆమిర్ అన్నాడు. ‘కూలీ’ చాలా పెద్ద సినిమా అవుతుందని ఆమిర్ ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on June 13, 2025 7:14 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…