Movie News

రామ్ చరణ్ & సందీప్ వంగా – ఏంటి కథ ?

టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాల గురించి రకరకాల లీకులు, ప్రచారాలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తో డ్రాప్ అయిన ఫాంటసీ మూవీని త్రివిక్రమ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. మాటల మాంత్రికుడు, వెంకటేష్ కాంబో కూడా ఈ మధ్యలో లాకైపోయింది. ఈ రెండు హారికా హాసినీ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. ఎటొచ్చి రామ్ చరణ్ ది మాత్రం రెండు రోజుల సందడికి పరిమితమై తర్వాత లేదనిపించుకుంది. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తావన ఎందుకొచ్చిందో చూద్దాం. ప్రస్తుతం తను స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇదయ్యాక సందీప్ వంగా చేయాల్సిన మూవీ యానిమల్ పార్క్. కానీ రన్బీర్ కపూర్ రామాయణం రెండు భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4లతో ఇంకో మూడేళ్లు దొరికే పరిస్థితిలో లేడు. ఇంకోవైపు రామ్ చరణ్ తో ఎప్పటి నుంచో సినిమా ప్లానింగ్ లో ఉన్న యువి క్రియేషన్స్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో దాన్ని సాధ్యం చేయాలనుకుంది. కానీ కథ పూర్తిగా సంతృప్తి పరచని కారణంతో పాటు గేమ్ చేంజర్ వల్ల ఇది కాస్తా విజయ్ దేవరకొండకు వెళ్ళిపోయింది. అయితే సందీప్ వంగా దగ్గర అర్జున్ రెడ్డి టైంలోనే యువి దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ఉంది. ఆ కమిట్ మెంట్ ఎప్పటికైనా పూర్తి చేయాలనేది ఒప్పందం.

సో ఇప్పుడు రామ్ చరణ్, సందీప్ వంగాలను కలిపేస్తే యువికి ఒకే దెబ్బకు రెండు జాక్ పాట్లు తగులుతాయి. ఈ కలయిక నిజమవ్వడం వెనుక ప్రభాస్ పాత్ర ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సందీప్ వంగా, యువి క్రియేషన్స్ విక్రమ్, రామ్ చరణ్ ముగ్గురికి మంచి దోస్తీ ఉంది. కాబట్టి సాధ్యమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. పెద్ది అయ్యాక చరణ్ ఎవరితో చేస్తాడనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. సుకుమార్ కనక త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేస్తే ఆర్సి 17లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో, స్పిరిట్ అయ్యేలోపు చరణ్ ఇంకో సినిమా చేసుకోవచ్చు. అది త్రివిక్రమా లేక కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్టా అనేది తెలియాల్సి ఉంది.

This post was last modified on June 12, 2025 9:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

34 minutes ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

5 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

7 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

8 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

9 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

10 hours ago