మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి మాములుగా లేదు. అల్లు అర్జున్ తో ఫాంటసీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు చేరడం దగ్గరి నుంచి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్ – త్రివిక్రమ్ కలయిక దాకా లీకులన్నీ ప్రచారాలుగా మారిపోయాయి. అయితే రామ్ చరణ్ తో కూడా ఒక మూవీ ఉంటుందనే వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది. పెద్ది తర్వాత, సుకుమార్ ఆర్సి 17 కన్నా ముందు ఈ కాంబో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు గట్టిగానే చెప్పాయి. కానీ సితార, హారిక హాసిని నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చింది.
అందులో చెప్పిన ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం కమిట్ మెంట్ ఇచ్చిన హీరోలు ఇద్దరే. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్. మిగిలినవి ఊహాగానాలు మాత్రమేనని, ఏదైనా ఉంటే మళ్ళీ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తామని నాగవంశీ కుండబద్దలు కొట్టేశారు. ఇది మెగా ఫ్యాన్స్ కి కొంత నిరాశ కలిగించే విషయమే అయినా అంత తేలిగ్గా కొట్టి పారేయడానికి లేదు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు చరణ్ – త్రివిక్రమ్ కలయికకు ప్రతిపాదన జరిగిన మాట వాస్తవమే కానీ అదెప్పుడు, ఎంత టైం పడుతుంది, రాబోయే ఏడాదిలో ఉంటుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్స్. అప్పటిదాకా వెంకీ, తారక్ మాత్రం అఫీషియల్ లిస్టులో ఉంటారు.
వెంకటేష్ ప్రస్తుతం రెస్టులో ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాకి వచ్చే నెల శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు మెగా 157లోనూ వెంకీ మామ నటించబోతున్నాడు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, వాసు లాంటి సినిమాలకు అద్భుతమైన మాటలు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా వెంకటేష్ నే డైరెక్ట్ చేయనుండటంతో అభిమానుల అంచనాలు మాములుగా ఉండబోవడం లేదు. హారిక హాసిని సంస్థ దీన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్యాస్టింగ్ ని ఫైనల్ చేసుకున్నాక అనౌన్స్ మెంట్ ఇస్తారు. ముహూర్తం తేదీ తదితరాలు ఇంకా నిర్ణయించుకోలేదని టాక్.
This post was last modified on June 12, 2025 12:33 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…