Movie News

తత్వం అర్థం చేసుకున్న నితిన్

నిన్న జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అందరి కంటే తక్కువ మాట్లాడింది హీరో నితినే.  పోయినసారి ఎక్కువ మాట్లాడానంటూ, ఈసారి సినిమా మాట్లాడాలి కాబట్టి సక్సెసయ్యాక పంచుకుంటానంటూ సింపుల్ గా పక్కకు తప్పుకున్నాడు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్, ఆర్టిస్ట్ లయతో పాటు ఇతర తారాగణం చెప్పుకోదగ్గ స్పీచులు ఇచ్చినా సరే నితిన్ మాత్రం వాళ్లలో సగం కూడా హడావిడి చేయలేదు. నిజానికీ మార్పుకు కారణం వరసగా వస్తున్న ఫెయిల్యూర్సే. ముఖ్యంగా రాబిన్ హుడ్ చాలా పెద్ద దెబ్బ కొట్టింది. నెలరోజులకు పైగా నితిన్ దాని కోసం అగ్రెసివ్ ప్రమోషన్లు చేశాడు.

రీల్స్, మీమ్స్, వెరైటీ ఇంటర్వ్యూలు, స్పూఫులు ఏదీ కాదనకుండా క్రియేటివ్ టీమ్ ఏది అడిగితే అది సంపూర్ణంగా నెరవేర్చాడు. కారణం సింపుల్. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల మీద నమ్మకం. కానీ రాబిన్ హుడ్ ఘోరంగా డిజాస్టరయ్యింది. యావరేజ్ అయినా కొంత ఊరట దక్కేది కానీ సాయంత్రం షోకే చేతులు ఎత్తేసింది. మైత్రి సంస్థ అంత బడ్జెట్ పెడితే కనీసం పావొంతు రికవర్ కాకపోవడం కన్నా ట్రాజెడీ ఏముంటుంది. అంతకు ముందు ఎక్స్ ట్రాడినరి మ్యాన్, మాచర్ల నియోజవర్గం కోసం కూడా నితిన్ ఇంతే కష్టపడ్డాడు. కానీ ఫలితాలు మాత్రం రిపీటవుతూనే వచ్చాయి.

ఎట్టకేలకు నితిన్ కు తత్వం బోధ పడింది. హడావిడి చేయడం కన్నా సినిమా విజయం సాధించాక మాట్లాడ్డం బెటరని డిసైడయ్యాడు. ఇది ఒకందుకు మంచిదే. తమ్ముడు కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ని టార్గెట్ చేసుకున్న వైనం వర్కౌట్ అయితే వసూళ్లు వస్తాయి. అందులోనూ సంక్రాంతి పండగా తర్వాత అన్ని వర్గాలను కదిలించిన మాస్ సినిమా ఒక్కటి రాలేదు. సిస్టర్ సెంటిమెంట్, ఎలివేషన్లు, అజనీష్ లోకనాథ్ సంగీతం లాంటి ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కనక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే నితిన్ ఎదురుచూపులు తీరినట్టే. జూలై 4 ఈ సస్పెన్స్ వీగిపోనుంది.

This post was last modified on June 12, 2025 11:05 am

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

13 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

25 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago