టాక్ ఎలా ఉంటేనేమి.. ఓటీటీ సినిమాలకు ఆదరణ ఏమీ తక్కువగా ఉండట్లేదు. నిశ్శబ్దం, మిస్ ఇండియా లాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఆయా ఓటీటీల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. రిలీజైన వారం పాటు అవి టాప్‌లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు ఓటీటీ సినిమాలన్నింటిలో అతి పెద్దది అనదగ్గ ‘లక్ష్మి’కి కూడా రెస్పాన్స్ ఓ రేంజిలో ఉన్నట్లు ట్రెండ్స్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రం ఇండియాలో ఇప్పటిదాకా విడుదలైన ఓటీటీ సినిమాలన్నింట్లోకి తొలి రోజు హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది.
ఇంతకుముందు ఈ రికార్డు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ పేరిట ఉంది. ఆ చిత్రం 24 గంటల్లో సాధించిన రికార్డ్ వ్యూస్‌ను అక్షయ్ కుమార్ సినిమా సగం రోజులోనే దాటేసింది. ఈ చిత్రం సోమవారం సాయంత్రం 7.05 గంటలకు విడుదల కాగా.. మంగళవారం ఉదయానికే రికార్డు వ్యూస్ మార్కును దాటేసినట్లు హాట్ స్టార్ వెల్లడించింది. అక్షయ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర క్రేజ్ మామూలుగా ఉండదు. టాక్‌తో సంబంధం లేకుండా వంద కోట్ల వసూళ్లు వస్తుంటాయి. ఇక మామూలుగానే హాట్ స్టార్‌కు అత్యధిక సబ్‌స్క్రిప్షన్లు ఉండగా.. ఐపీఎల్ పుణ్యమా అని అవి ఇంకా పెరిగాయి.
ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉంటోంది. అలాంటపుడు అక్షయ్ కుమార్ సినిమా వస్తే హిందీ ప్రేక్షకులు ఓ లుక్కేయకుండా ఎలా ఉంటారు. కాబట్టి ‘దిల్ బేచారా’ రికార్డును ‘లక్ష్మి’ బద్దలు కొట్టేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన వ్యూస్‌ను బట్టి టికెట్ల రేట్లతో మల్టిప్లై చేస్తే వసూళ్లు వెయ్యి కోట్ల దాటి ఉన్నా ఆశ్చర్యం లేదేమో. సౌత్ బ్లాక్‌బస్టర్ ‘కాంఛన’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘లక్ష్మి’కి టాక్ అయితే ఏమంత బాగా రాలేదు. మెజారిటీ ప్రేక్షకులు దీని పట్ల అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on November 10, 2020 10:35 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…