పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం.. ఫౌజీ. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం.. దీని కథా నేపథ్యం.. బడ్జెట్.. అన్నీ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దీన్ని ట్రూ పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్న హను.. వివిధ భాషల నుంచి ముఖ్య పాత్రల కోసం ఆర్టిస్టులను తీసుకుంటున్నాడు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకుముందు ‘కార్తికేయ-2’లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి మెప్పించిన అనుపమ్.. దాని తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఆయన ‘ఫౌజీ’ సెట్స్‌లోకి అడుగు పెట్టారు. కానీ మామూలుగా కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఏ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టని విధంగా ఆయన ఎంట్రీ జరిగింది.
హైదరాబాద్ శివార్లలో అడవిలో ఉన్న ప్రాంతంలో ‘ఫౌజీ’ షూట్ జరుగుతోంది. అక్కడికి చేరుకునేందుకు అనుమప్ కోసం కారును పంపారు నిర్మాతలు. ఐతే డ్రైవర్ దారి తప్పి షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి దగ్గర్లో ఇరుక్కుపోయాడు. అది డెడ్ ఎండ్. కారును రివర్స్ చేయడానికి కూడా వీలు పడని పరిస్థితి. ఐతే సమీపంలోనే ఒక పెద్ద గోడకు అవతల ‘ఫౌజీ’ షూట్ జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో అనుపమ్ కోసం గోడకు ఇవతల ఒక నిచ్చెన వేసి.. దాని ద్వారా లొకేషన్‌లోకి తీసుకొచ్చింది ప్రొడక్షన్ టీం.
తమ డ్రైవర్ ఈ ప్రయాణాన్ని అడ్వెంచరస్‌గా మార్చాలని అనుకున్నాడని.. దీంతో ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ లేని విధంగా, చాలా తమాషాగా ‘ఫౌజీ’ సెట్స్‌లోకి తన ఎంట్రీ జరిగిందని అనుపమ్ ఒక వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా 30 శాతం మేర పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ సరసన కొత్తమ్మాయి ఇమాన్వి నటిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్ల పైమాటే అని సమాచారం.
This post was last modified on June 8, 2025 4:46 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…