ఇటీవలే విడుదలైన హౌస్ ఫుల్ 5 కు యునానిమస్ బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. చీప్ కంటెంట్, బూతు జోకులు, సిల్లీ కామెడీతో నింపేసి థియేటర్ నుంచి పారిపోయేలా చేశారని విమర్శకులు విరుచుకు పడ్డారు. బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ కనీసం హిట్టు అని చెప్పుకునే స్థాయిలో ఏమంత పెరుగుదల లేకపోవడం నిర్మాతలని టెన్షన్ పెడుతోంది. పైగా రెండు వెర్షన్లు రెండు క్లైమాక్స్ లు ప్రపంచంలో మేమే మొదటిసారి చేశామని చెప్పుకోవడం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మాత్రం సంబరానికి ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చారనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.
ఇదంతా ఎలా ఉన్నా సినిమా బ్రహ్మాండంగా ఉందని బలంగా నమ్ముతూ వచ్చిన అక్షయ్ కుమార్ అసలు గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని స్వయంగా రంగంలోకి దిగాడు. ముఖాన్ని పూర్తిగా కవర్ చేసే మాస్కుని వేసుకుని చిన్న మైకుతో షో అయ్యాక బయటికి వస్తున్న ప్రేక్షకులను రెస్పాన్స్ అడగటం మొదలుపెట్టాడు. ట్విస్ట్ ఏంటంటే కొందరు ఫేస్ తిప్పేసుకుని వెళ్లిపోగా కొందరు బాగుందని, మరికొందరు అస్సలు బాలేదని మొహం మీద చెప్పారు. ఎవరూ తమను ప్రశ్నలు అడుగుతున్నది అక్షయ్ కుమారని గుర్తు పట్టకపోవడం విచిత్రం. ఆలా అక్షయ్ సాహస యాత్ర ముగిసింది.
ఇక్కడ ఇంకొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకోవాలి. క్రిటిక్స్ గొప్పగా మెచ్చుకున్న కేసరి చాప్టర్ 2కి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆ సినిమా రీచ్ కాలేదు. డబుల్ మీనింగులు నిండుగా ఉన్నా హౌస్ ఫుల్ 5కి యు/ఏ దక్కింది. కానీ కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉన్నారు. అసలే కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లతో కుదేలవుతున్న అక్షయ్ కుమార్ కి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. డైరెక్ట్ గా వెళ్లి జనాలను అడిగినా సినిమా బాలేదని చెబితే ఏ హీరోకైనా జీర్ణం కావడం కష్టం. ఇప్పుడో మోస్తరుగా ఉన్నా వీకెండ్ అయ్యాక హౌస్ ఫుల్ 5కి విపరీతమైన డ్రాప్స్ తో ఫ్లాప్ ముద్ర తప్పేలా లేదు.
This post was last modified on June 8, 2025 4:01 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…