సమంత కెరీర్లో ‘ఏమాయ చేసావె’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ఆ చిత్రంతోనే తన కెరీర్ గొప్ప మలుపు తిరిగింది. తెలుగులో పెద్ద బ్రేక్ వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది సమంత. తర్వాతి కాలంలో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్న నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది కూడా ఈ సినిమాతోనే. అందుకే ‘ఏమాయ చేసావె’ను తన జీవితంలో చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెబుతూ ఉండేది సమంత. ఈ క్రమంలోనే ఆమె తన మెడ మీద ‘వైఎంసీ’ అని ఇంగ్లిష్ అక్షరాలతో పచ్చబొట్టు కూడా వేయించుకుంది. నాగచైతన్య నుంచి విడిపోయాక కూడా ఈ పచ్చబొట్టు అలాగే కొనసాగింది. కానీ ఇప్పుడు ఆమె ఒంటి మీది నుంచి ఆ పచ్చబొట్టు ఎగిరిపోవడం గమనార్హం.
సమంత తాజాగా ఒక ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. దానికి ‘ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది’ అనే క్యాప్షన్ కూడా రిలీజ్ చేసింది. సమంత చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న వీడియోలో.. అందరి దృష్టీ తన మెడ మీదికి వెళ్లింది. అక్కడ గతంలో హైలైట్ అవుతూ వచ్చిన ‘వైఎంసీ’ అనే అక్షరాలు మాయం అయ్యాయి.
నాగచైతన్యకు సంబంధించిన గురుతులేవీ తన దగ్గర ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఆమె ఈ పచ్చబొట్టును చెరిపివేయించుకుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు నడుము మీద ఉన్న ‘చై’ అనే పచ్చబొట్టును ఆమె తీయించేసుకుంది. ప్రస్తుతం సమంత.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లయిన రాజ్.. తన మొదటి భార్య నుంచి విడిపోయి సమంతను పెళ్లాడబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలోనే సమంత ఇలా పచ్చబొట్టును చెరిపేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on June 7, 2025 6:06 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…