పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ వచ్చే వారం విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా మరోసారి వాయిదా పడింది. అలా అని చిత్ర బృందం ప్రమోషన్లు ఏమీ ఆపేయలేదు. నిన్న దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. అక్కడ అసలు కార్యక్రమం కంటే.. ‘హరిహర వీరమల్లు’ గురించి జ్యోతికృష్ణ చేసిన ప్రసంగమే హైలైట్ అయింది. ఆ కార్యక్రమం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లా మారిపోవడం విశేషం.
తన ప్రసంగంలో జ్యోతికృష్ణ అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. తొలిసారిగా ఈ సినిమా బడ్జెట్ గురించి అతను వెల్లడించాడు. ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించాడు. సినిమాలో హైలైట్ల గురించి మాట్లాడుతూ.. పవన్ కొన్ని నెలల కిందట కాకినాడలో అన్న ‘సీజ్ ద షిప్’ డైలాగ్‌ను గుర్తు చేసుకుని.. దాన్ని తలపించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను సినిమాలో తీర్చిదిద్దినట్లు వెల్లడించాడు జ్యోతికృష్ణ. సినిమాలో మచిలీపట్నం పోర్ట్ నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని జ్యోతికృష్ణ చెప్పాడు.
తెల్లవాళ్లు మన సంపదను దోచుకుపోతుంటే.. పవన్ వచ్చి వాళ్లకు బుద్ధి చెప్పి ‘సీజ్ ద షిప్’ అనే మాటను రీ క్రియేట్ చేసినట్లుగా ఈ ఎపిసోడ్ ఉంటుందని జ్యోతికృష్ణ తెలిపాడు. ఇంకా పవన్ నిజ జీవితానికి రిలేట్ అయ్యేలా అనేక సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని జ్యోతికృష్ణ అన్నాడు. ఈ సినిమాలో మచిలీపట్నం పోర్టును చూశాక ఆంధ్రా అనే కాక దేశమంతా దద్దరిల్లిపోతుందని అతను వ్యాఖ్యానించాడు. ‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ మూడుసార్లు చూశాడని.. తనను గంటసేపు పొగిడాడని.. తనతో ఇంకో సినిమా చేయాలని ఉందని కూడా చెప్పాడని జ్యోతికృష్ణ పేర్కొన్నాడు.
This post was last modified on June 7, 2025 3:19 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…