తాజాగా విడుదలైన థగ్ లైఫ్ లో త్రిష పాత్రను చూశాక అభిమానుల నుంచి ముక్తకంఠంతో వినిపిస్తున్న కోరిక ఇదొక్కటే. విడుదలకు ముందు ట్రైలర్ చూశాక తను కమల్ హాసన్ తో రొమాన్స్ చేయడం గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మీమ్స్ వచ్చాయి. ఇదే విషయం తనను ఇంటర్వ్యూలో అడిగితే తెరమీద చూడండి, థ్రిల్ అయ్యే ట్విస్టు ఉంటుందని చెప్పింది. తీరా చూస్తే ఇటు కమల్ అటు శింబు ఇద్దరితో రొమాన్స్ పెట్టిన దర్శకుడు మణిరత్నం అసలేం చెప్పాలనుకున్నాడో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. పైగా త్రిష క్యారెక్టర్ కిచ్చిన ఎండింగ్ చూశాక నోటమాట రావడం కష్టమే.
సెకండ్ సెటప్, వేశ్యగా స్టార్ హీరోయిన్లను చూపించడం కొత్త కాదు. ఆ మాటకొస్తే వేదంలో అనుష్క ఎంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందో ఎవరూ మర్చిపోలేం. కానీ థగ్ లైఫ్ లో త్రిషకు అంత స్కోప్ దొరకలేదు. అసలు మణిరత్నం టేస్ట్ ఇంతగా పడిపోయిందా అని చెప్పేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. జైలు నుంచి బయటికి వచ్చిన కమల్ హాసన్ మూడు రోజులు త్రిష ఇంట్లోనే గడుపుతాడు. వాళ్ళ బంధం గురించి బయట వృద్ధురాలైన వడవుక్కరసి వర్ణించడం వింటే బి గ్రేడ్ కంటే అన్యాయంగా ఉంటాయి. అసలీ పాత్ర లేకపోయినా కథకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేలా త్రిషని చూపించడం ట్రాజెడీ.
సరే తమిళంలో ఎలా చూపించినా ఓకే కానీ త్రిష నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా విశ్వంభర. చిరంజీవి హీరో అందులోనూ ఫాంటసీ మూవీ కనక తగినంత ప్రాధాన్యం దక్కి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీతో ఓ మోస్తరు హిట్ థగ్ లైఫ్ తో అల్ట్రా డిజాస్టర్ అందుకున్న త్రిషకు మెగా మూవీ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. దీంతో పాటు మోహన్ లాల్ తో కలిసి నటించిన రామ్ కూడా లైన్ లో ఉంది. కాకపోతే షూట్ ఇంకా బాలన్స్ ఉంది. పొన్నియిన్ సెల్వన్ లో ఎంతో అందంగా చూపించిన మణిరత్నమే ఇప్పుడీ థగ్ లైఫ్ ఇంత చెత్తగా చూపించడాన్ని సగటు ప్రేక్షకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on June 6, 2025 5:22 pm
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…