నాయకుడు లాంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన కమల్ హాసన్, మణిరత్నం నుంచి 38 ఏళ్ల విరామం తర్వాత సినిమా వస్తుంటే వీళ్లిద్దరి అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. ‘థగ్ లైఫ్’ ట్రైలర్ చూసి అంచనాలు పెంచేసుకున్నారు. కమల్ హాసన్ అయితే ‘నాయకన్’ను మించిన సినిమా అంటూ ‘థగ్ లైఫ్’కు ఎలివేషన్ ఇవ్వడంతో హైప్ ఇంకా పెరిగిపోయింది. ఒక అద్భుతాన్ని చూడబోతున్నామనే అంచనాతో నిన్న థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయింది. ఒక రొటీన్, బోరింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాతో మణిరత్నం తన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు.
మణిరత్నం కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు కానీ.. రవ్వంతైనా కొత్తదనం లేకుండా, ఇంత సాధారణమైన సినిమాను అందించడమే ఆశ్చర్యం కలిగించే విషయం. తమిళ క్రిటిక్స్‌లో చాలామంది ఎప్పట్లాగే సినిమా బాగుందని, నాట్ బ్యాడ్ అని రివ్యూలు ఇస్తున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇక తెలుగు వాళ్లయితే సినిమాను ఏకిపడేస్తున్నారు. మణిరత్నం, కమల్‌లకు ఇక్కడ మంచి ఫాలోయింగే ఉంది. వాళ్లందరూ సినిమా చూసి తీవ్రంగా నిరాశ చెందారు.
‘థగ్ లైఫ్’ మీద నిన్న ఉదయం నుంచే ట్రోల్స్ మొదలైపోయాయి. దీన్ని ‘ఇండియన్-2’తో పోలుస్తూ చాలామంది మీమ్స్ వేస్తున్నారు. కొందరైతే ‘ఇండియన్-2’నే దీని కంటే బెటర్ అని.. దాని కంటే బ్యాడ్ సినిమా కమల్ నుంచి రాదనుకున్న వారికి అది తప్పని రుజువు చేశారని కౌంటర్లు వేస్తున్నారు. ఇక కమల్ చేసిన ఓ కామెంట్ వల్ల ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాని సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబితేనే ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో రిలీజ్ చేయనిస్తామని అక్కడి వాళ్లు అంటే.. కమల్ అసలు తానే అక్కడ ఆ చిత్రాన్ని రిలీజ్ చేయనని తేల్చేశాడు. ఐతే ఈ గొడవ వల్ల కర్ణాటక జనాలు సేఫ్ అయిపోయారని.. ‘థగ్ లైఫ్’ చూడాల్సిన కష్టం వారికి రాలేదని మీమ్స్ పడుతున్నాయి సోషల్ మీడియాలో.
This post was last modified on June 6, 2025 2:44 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…