ఎన్నోసార్లు వాయిదా పడింది, ఇప్పుడో లెక్కా అన్నట్టు జూన్ 12 నుంచి హరిహర వీరమల్లు తప్పుకున్నాక ట్రేడ్ సర్కిల్స్ తో మొదలుపెట్టి ఫ్యాన్స్ నుంచి అందరిని తొలుస్తున్న ప్రశ్న ఒకటే. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది. సిజి వర్క్ అవ్వలేదు. ట్రైలర్ ఇంకా కట్ చేయాలి. బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి రాలేదు. నిర్మాత ఏఎం రత్నం అడుగుతున్న రేట్లకు బయ్యర్లు ఇస్తున్న కోట్లకు మధ్య వ్యత్యాసం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. హిందీ పంపిణి హక్కులు కొన్న అనిల్ తదాని ట్రైలర్, థియేటర్ మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ తో పాటు ముంబైలో ఒక ఈవెంట్ చేయమని సూచన చేశారట.
ఇవన్నీ కాసేపు పక్కనపెడితే అసలు వీరమల్లు ముందున్న ఆప్షన్లేంటో చూద్దాం. జూన్ 20 ఛాన్స్ లేదు. ధనుష్ – నాగార్జున కుబేరకు ప్యాన్ ఇండియా ప్లానింగ్ జరిగిపోయింది. ఇప్పుడు వెనుకడుగు వేయడం చాలా కష్టం. థియేటర్ అగ్రిమెంట్లు, అడ్వాన్సులు గట్రా జరిగిపోయాయట. ముఖ్యంగా థగ్ లైఫ్ పోయిన నేపథ్యంలో కోలీవుడ్ బయ్యర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. సో దక్షిణాదిలో భారీ ఓపెనింగ్స్ కి అవకాశం ఉంది. జూన్ 27 నుంచి తప్పుకునే సమస్యే లేదంటూ కన్నప్ప సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. దానికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. ఈ నెల మొత్తం బ్లాకైపోయింది.
ఇక జూలై 4 కింగ్ డమ్ ఉంది. ఒకవేళ వీరమల్లు వస్తానంటే సితార సంస్థ త్యాగం చేసే సూచనలు ఎక్కువ. కానీ అప్పటికైనా పవన్ మూవీ రెడీ అవుతుందా అంటే ఏమో చెప్పలేం. జూలై 11 అనుష్క ఘాటీకి రంగం సిద్ధమయ్యింది. ఇది కూడా పోస్ట్ పోన్లతో నెట్టుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. జూలై 18 స్లాట్ ప్రస్తుతానికి ఖాళీగానే కనిపిస్తోంది. జూలై 25 నితిన్ తమ్ముడుని ప్లాన్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు. ఒకవేళ పవన్ ఈ రెండు తేదీల్లో ఏది కోరుకున్నా ఆ డేట్లలో ఉన్న సినిమాలు తప్పుకుంటాయి. ఆగస్ట్ అంటే రిస్క్ అవుతుంది కాబట్టి హరిహర వీరమల్లు ఖచ్చితంగా జూలైలోనే రావాలి. చూద్దాం ఈ పద్మవ్యూహం ఎలా బద్దలవుతుందో.
This post was last modified on June 6, 2025 11:36 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…