తాజాగా విడుదలైన థగ్ లైఫ్ మీద రామ్ చరణ్ అభిమానులు ముందు నుంచే కన్నేశారు. ఎందుకంటే దీనికి సంగీతం అందించిన ఏఆర్ రెహమానే పెద్దికి స్వరకర్త కాబట్టి. కమల్ మూవీకి బెస్ట్ ఇచ్చి ఉంటే నిశ్చింతగా హమ్మయ్యా అనుకోవచ్చనుకున్నారు. కమల్ మూవీకి ఒకప్పుడు భారతీయుడు, తెనాలి లాంటి సూపర్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్ ఇప్పుడు అదే మేజిక్ చేయాలని ఆశించడంలో తప్పు లేదు. తీరా చూస్తే థగ్ లైఫ్ లో పాటలు, బీజీఎమ్ రెండు ఒకదాంతో మరొకటి పోటీపడి నీరసంగా సాగాయి. అక్కడక్కడా తన మార్క్ కొంత వినిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తీవ్రంగా నిరాశ పరిచిన మాట వాస్తవం.
మణిరత్నం అంతటి లెజెండరీనే రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోలేకపోతే ఇక బుచ్చిబాబు లాంటి ఒక్క సినిమా దర్శకుడు ఎలాంటి ట్యూన్స్ చేయిస్తాడోననే సందేహం రావడం సహజం. పెద్ది టీజర్ ఆ భయాన్ని కొంతమేర పోగొట్టింది. చిన్న వీడియోనే అయినా రెహమాన్ ఇచ్చిన స్కోర్ బాగా కుదిరింది. బుచ్చిబాబు వెంటపడి రెండు మూడు ట్యూన్స్ వద్దనుకున్నాక ఇది ఫైనల్ అయ్యిందని, అదే తరహాలో పాటలు కూడా తీసుకుంటాడనే నమ్మకం మెగా ఫాన్స్ లో ఉంది. అసలే రెహమాన్ కు తెలుగులో స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ లేదనే నెగటివ్ సెంటిమెంట్ సూపర్ పోలీస్ నుంచి కొమరం పులి దాకా కొనసాగుతూనే ఉంది.
మధ్యలో సాహసం శ్వాసగా సాగిపో, ఏ మయ చేశావే లాంటి డీసెంట్ హిట్స్ ఉన్నాయి కానీ రికార్డులు బద్దలు కొట్టినవి లేదు. ఇప్పుడు పెద్ది దాన్ని తిరగరాయాలి. మూడు పాటల రికార్డింగ్ గత ఏడాదే పూర్తయ్యింది. ఉప్పెనకు బుచ్చిబాబు చేయించుకున్న సాంగ్స్ ఏ స్థాయిలో హిట్టయ్యాయో చూశాం. మరి పెద్దికి కూడా అదే జరిగితే సంతోషమే. వచ్చే ఏడాది మార్చి 27 విడుదల కాబోతున్న ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ నలభై శాతం దాకా పూర్తయ్యింది. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ చేశారు. ఒకవేళ వింటేజ్ రెహమాన్ కనక పెద్దిలో వినిపిస్తే మ్యూజిక్ లవర్స్ కు అంతకన్నా శుభవార్త ఏముంటుంది.
This post was last modified on June 5, 2025 5:08 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…