Movie News

అరుదైన కలయికకు ‘లైఫ్’ ఇస్తుందా

మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న బిగ్ డే వచ్చేసింది. కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కలయికలో రూపొందిన థగ్ లైఫ్ ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. కర్ణాటక  భాషకు సంబంధించి కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిషేధం విధించడంతో దీని మీద ఫోకస్ మరింత పెరిగింది. నాయకుడు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ వచ్చిన 38 సంవత్సరాల తర్వాత రిపీటైన కాంబో కావడంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విక్రమ్ స్థాయిలో లేకపోయినా ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల పరంగా ఎక్కువ ట్రెండ్ అయిన మూవీ ఇదేనని చెప్పాలి.

యుఎస్ ప్రీమియర్ల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఇండియా టాక్ ఎలా ఉండబోతోందనేది కీలకం కాబోతోంది. తెలుగు వరకు ఏమంత బజ్ కనిపించకపోవడం కొంత ఆందోళన కలిగించే విషయమే కానీ విక్రమ్ లాగా రెస్పాన్స్ వస్తే అమాంతం పికప్ చూడొచ్చు. పైగా బాక్సాఫీస్ ఖాళీగానే ఉంది. చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఈ అవకాశాన్ని వాడుకుంటే భారీ వసూళ్లు చూడొచ్చు. మూడు దశాబ్దాల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ కమల్ మణిరత్నం కలవడం బాగుంది కానీ ఇంత అంచనాలను ఏ మేరకు తట్టుకుంటుందనేది వేచి చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం కోసం చూస్తున్న ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు.

కర్ణాటక వివాదంలో క్షమాపణ చెప్పకుండా చాలా దూరం తీసుకెళ్లిన కమల్ హాసన్ కు ఆ రాష్ట్రంలో బ్యాన్ కావడం వల్ల జరిగిన నష్టం వాళ్ళకేనని నిరూపించాలంటే ఇది బ్లాక్ బస్టర్ కావాలి. లేదంటే రివర్స్ లో ట్రోలింగ్ లాంటివి చవి చూడాల్సి రావొచ్చు. త్రిష, అభిరామి, శింబు, అశోక్ సెల్వన్, నాజర్ లాంటి క్యాస్టింగ్ హైప్ ని పెంచింది. టైటిల్ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల మాస్ వర్గాలకు త్వరగా రీచ్ కాలేకపోవడం కొంత ప్రభావాన్ని చూపిస్తున్న మాట వాస్తవం. భారతీయడు 2 దారుణమైన డిజాస్టర్ తర్వాత మరో సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కమల్ హాసన్ కు థగ్ లైఫ్ ఏ మేరకు ఊరటనిస్తుందో చూడాలి.

This post was last modified on June 5, 2025 9:17 am

Share

Recent Posts

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

18 minutes ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

1 hour ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

2 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

2 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

2 hours ago

విశ్వదాభిరామా… వినవయ్యా విశ్వంభరా

చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…

2 hours ago