హిట్ 3 ది థర్డ్ కేస్ మొదటి వీకెండ్ ఎంత రఫ్ఫాడించినప్పప్పటికీ తర్వాత అమాంతం డ్రాప్ అయిపోవడం దాచలేని ఓపెన్ సీక్రెట్. వంద కోట్ల పోస్టర్ వేసుకున్న మాటే కానీ నిజంగా ఆ స్థాయి ఎక్స్ ట్రాడినరి టాక్ వచ్చిందా అంటే వెంటనే ఔనని చెప్పలేని పరిస్థితి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక ట్రెండింగ్ లో అయితే ఉంది కానీ నాని అభిమానులు కోరుకున్న అప్లాజ్ సోషల్ మీడియాలో కనిపించలేదు. పైగా అంతగా ఏముందని మోశారంటూ డైరెక్ట్ ఓటిటిలో చూసిన వాళ్ళు కామెంట్స్ పెట్టారు. కోర్ట్ రేంజ్ లో డిజిటల్ బ్లాక్ బస్టర్ కాకపోవచ్చనే అనుమానాలు లేకపోలేదు. దర్శకుడు శైలేష్ కొలను ఈ ఫీడ్ బ్యాక్ అంతా చూసే ఉంటారు.
అందుకే ఈసారి క్రైమ్, వయొలెన్స్ కి దూరంగా ఒక కూల్ ఎంటర్ టైనర్ రాసుకున్నట్టు తెలిసింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకతో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో దీన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాజెక్టు లాకైపోయిందని అంటున్నారు. హిట్ సిరీస్ కి కొంత కాలం బ్రేక్ ఇద్దామని నాని ప్రతిపాదించాడట. ఎలాగూ నాలుగో భాగంలో నటించాల్సిన కార్తీ డైరీ ఇంకో రెండు సంవత్సరాలకు పైగానే బిజీగా ఉంది. సర్దార్ 2, ఖైదీ 2, వావా వతియర్ అంటూ మాములు బిజీగా లేడు. సో శైలేష్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో మెప్పిస్తేనే ఏసిపి వీరప్పన్ గా నటించేందుకు కార్తీ రెడీ అవుతాడు.
చూస్తుంటే శైలేష్ కొలనుకు బాక్సాఫీస్ తత్వం బోధపడినట్టు ఉంది. ఏదైనా టాక్ లేదా రివ్యూలలో నెగటివిటి వస్తే అంత సులభంగా అంగీకరించని ఈ ఎంబిబిఎస్ డైరెక్టర్ కు హిట్ 3 యునానిమస్ గా అందరినీ మెప్పించలేదనే వాస్తవం అర్థమైపోయింది. ఎంత సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా మరీ పిల్లలు మొహాలు తిప్పుకునేంత దారుణమైన హింస అందులో లేదు. అందుకే ఓటిటిలో ఫ్యామిలీ ప్రేక్షకులు బాగానే చూశారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆఫ్ స్క్రీన్ లో మంచి కామిక్ టైమింగ్ ఉన్న శైలేష్ కొలను ఇప్పుడు దాన్ని రోషన్ సినిమాలో ఏ మేరకు బయటికి తీసుకొస్తాడో చూడాలి.
This post was last modified on June 4, 2025 12:06 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…