కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా. స్టార్లు లేరు. మనకు శ్రీకాంత్ ఎలాగో కోలీవుడ్ లో శశికుమార్ అలాగా. అతనే ప్రధాన పాత్ర. హీరోయిన్ లేదు. భార్యగా సిమ్రాన్ మధ్యవయసు దాటిన తల్లిగా నటించింది. సూర్య రెట్రోకు పోటీగా మే 1 రిలీజయ్యింది. కట్ చేస్తే నాలుగు వారాలకే 90 కోట్ల వసూళ్లకు దగ్గర వెళ్ళిపోయి ట్రేడ్ ని విస్మయపరిచింది. నెల రోజులకే ఓటిటిలో వచ్చి ఇతర బాషల డబ్బింగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సింపుల్ కథని అందమైన ఎమోషన్స్ జోడించి, సరదాగా నవ్విస్తూ, అక్కడక్కడా ఏడిపిస్తూ దర్శకుడు అబిషన్ జీవింత్ తీర్చిదిద్దిన విధానం దాన్ని బ్లాక్ బస్టర్ గా మార్చింది.
ఇంతా చేసి ఇతని వయసు పాతికేళ్లే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం ఇతను ఆఫర్లతో తలమునకలవుతున్నాడు. ధనుష్ ఆల్రెడీ ఒక ప్రాజెక్టుకు లాక్ చేసుకోగా సూర్య బ్యానర్ నుంచి మరో అడ్వాన్స్ వచ్చిందని చెన్నై రిపోర్ట్. ఈ ఇద్దరూ ఇతని దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జీవింత్ కథలు రాసే పనిలో ఉన్నాడు. ముందు ధనుష్ ది మొదలు కానుంది. కాకపోతే టైం పట్టేలా ఉంది.. కంటెంట్ ఉంటే చిన్నా పెద్ద తేడా లేకుండా ఎలాంటి సినిమా అయినా ఆదరణ దక్కించుకుంటుందని చెప్పడానికి టూరిస్ట్ ఫ్యామిలీనే మంచి ఉదాహరణ. తెలుగులోనూ ఇలాంటి ప్రయత్నాలు జరగాలి.
సోషల్ మీడియా స్పందన చూస్తే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా టూరిస్ట్ ఫ్యామిలీ అందరినీ ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో తమిళ వెర్షనే నెల రోజులకు పైగా ఆడటం దీని విజయానికి మరో కొలమానం. శ్రీలంక నుంచి వలస వచ్చిన ఒక కుటుంబం చెన్నైలోని ఒక కాలనీలో తల దాచుకుంటుంది. ముందు నిజం తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చిన అక్కడి జనాలు తర్వాత వీళ్ళ మంచితనం అర్థం చేసుకుని పోలీసులకు దొరకనివ్వకుండా స్వంత వాళ్ళుగా కాపాడుకుంటారు. హాస్యం, భావోద్వేగం సమపాళ్ళలో కుదిరిన ఈ ఎంటర్ టైనర్ దర్శకధీర రాజమౌళిని సైతం మెప్పించింది.
This post was last modified on June 4, 2025 9:59 am
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…