Movie News

విజయ్ దేవరకొండ మళ్ళీ త్యాగం చేయాలా?

హరిహర వీరమల్లు వాయిదా వార్తలు ప్రచారంలోకి రాగానే ఇప్పుడు అందరి కన్ను కొత్త డేట్లు ఏమై ఉంటాయనే దాని మీద ఉంది. వాటిలో మొదటిది జూన్ 27. మంచు విష్ణు కన్నప్ప ఆల్రెడీ అన్ని రకాల మార్కెటింగులు, థియేటర్ అగ్రిమెంట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. ప్రభాస్ లాంటి కీలక ఆర్టిస్టుల డబ్బింగ్ తప్ప మొత్తం పూర్తయ్యిందని టాక్. దానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ చేసుకున్న విష్ణు మరోసారి తప్పుకునే ఉద్దేశంలో ఎంత మాత్రం లేడని సన్నిహితుల సమాచారం. నెక్స్ట్ ఆప్షన్ జూలై 4. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కోసం అఫీషియల్ గా దాన్ని లాక్ చేసుకుని పెట్టుకున్నారు.

ఒకవేళ హరిహర వీరమల్లు కోసం ఆ డేట్ కావాలంటే విజయ్ దేవరకొండ త్యాగం తప్పకపోవచ్చు. ఎందుకంటే సితార సంస్థతో పవన్ కున్న అనుబంధం, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం లాంటి కారణాలు ఖచ్చితంగా రాజీ పడేలా చేస్తాయి. అదే కనక జరిగితే కింగ్ డమ్ అదే నెల రెండు లేదా మూడో వారంకు వెళ్లాల్సి ఉంటుంది. ఎలాగూ ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన పనులు పెండింగ్ ఉన్నాయి. చేతిలో ఉన్న 29 రోజుల్లో అన్ని పూర్తి చేసి ప్రమోషన్లకు సరిపడా సమయాన్ని ఉంచుకుంటారా లేదానే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. టీమ్ అయితే అన్నీ ప్లానింగ్ ప్రకారం పూర్తవుతాయని అంటోంది.

ఎట్టి పరిస్థితుల్లో వీరమల్లు ఇంకో నెల కంటే ఎక్కువ ఆలస్యం చేయడానికి లేదు. ఎందుకంటే ఆగస్ట్ లో అస్సలు ఛాన్స్ లేదు. వార్ 2, కూలి, మాస్ జాతరలు ఆ నెలలో ఉన్నాయి. అసలు అంత లేట్ అంటే ఓటిటి హక్కులు కొన్న ప్రైమ్ నుంచి మద్దతు దొరక్కపోవచ్చు. అసలు ఇప్పుడే ఇవ్వాలనుకున్న మొత్తంలోనే కోత ఉంటుందనే టాక్ పరిశ్రమ వర్గాల్లో ఉంది. సో ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా వీరమల్లు మహా ఇరకాటంలో పడ్డాడు. ఇప్పటికైతే మెగా సూర్య ప్రొడక్షన్స్ నుంచి అఫీషియల్ నోట్ రాలేదు కానీ టాలీవుడ్ మొత్తం ఇదే టాపిక్ డిస్కస్ చేసుకుంటోంది. చూడాలి మరి ఇంకేం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.

This post was last modified on June 3, 2025 5:26 pm

Share

Recent Posts

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

2 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

9 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

10 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

11 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

16 hours ago