తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఇంకో పది రోజుల్లోనే ఆ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. షూట్ చాలా ఆలస్యం కావడం వల్ల ఈ సినిమాకు ఇంతకుముందున్న హైప్ తగ్గిన మాట వాస్తవం. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. రిలీజ్ టైంకి ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుందనే టీం ఆశిస్తోంది. పవన్ ప్రమోషన్లలో పాల్గొనకపోయినా.. మిగతా టీం సభ్యులు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు బజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఏఎం రత్నం సినిమాలోని మేజర్ హైలైట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ సినిమాలో రూ.20 కోట్ల ఖర్చుతో తీసిన యాక్షన్ ఎపిసోడ్ పవన్ అభిమానులనే కాక, ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు. తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాక.. తన మార్కు చూపించేలా ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్లు రత్నం వెల్లడించారు. జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టులోకి వచ్చాక ఏదైనా స్పెషల్‌గా చేయాలని అనుకున్నాడని.. అందుకోసం బాగా ఆలోచించి భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని రత్నం తెలిపారు. ఆ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని.. దానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ప్రస్తుతం ఫారిన్లో జరుగుతుందని.. త్వరలోనే ఆ కంటెంట్‌ను సినిమాకు జోడిస్తామని రత్నం తెలిపారు.
ఈ ఒక్క ఎపిసోడ్‌కే రూ.20 కోట్లు ఖర్చు పెట్టామని. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సీక్వెన్స్ ఉంటుందని రత్నం తెలిపారు. ఇక దర్శకుడిగా క్రిష్ స్థానంలోకి తన కొడుకు రావడం గురించి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా చిత్రీకరణ చాలా ఆలస్యం అవుతుండడం, మరోవైపు ‘ఘాటి’తో పాటు క్రిష్ చేతిలో వేరే ప్రాజెక్టులు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రత్నం తెలిపారు. జ్యోతికృష్ణ రావడంతో ఈ ప్రాజెక్టుకు మంచే జరిగిందని, మిగతా సన్నివేశాలను అతను అద్భుతంగా తీశాడని రత్నం కితాబిచ్చారు.
This post was last modified on June 3, 2025 5:07 pm
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…