థగ్ లైఫ్ వివాదానికి సంబంధించి కర్ణాటక హై కోర్టు కమల్ హాసన్ కు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందనే రీతిలో సూచన చేశాక వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. తదుపరి హియరింగ్ ని జూన్ 10 కి వాయిదా వేయడంతో కమల్ ఇప్పుడు తన సినిమాని శాండల్ వుడ్ లో రిలీజ్ చేయాలంటే సారీ చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. జూన్ 5 రిలీజ్ కావడంతో రోజుల వ్యవధి గంటలకు మారిపోయింది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు సుదీర్ఘ లేఖ రాసిన కమల్ అందులో జరిగిన పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు తప్పించి ఎక్కడా క్షమాపణ చెబుతున్న దాఖలాలు ఉంచలేదు. కన్నడ మీద గౌరవమంటూనే సారీ చెప్పలేదు.
ఈ లెక్కన థగ్ లైఫ్ కర్ణాటకలో అడుగు పెట్టడం దుర్లభమే. ఫిలిం ఛాంబర్ పెద్దలు ఇవాళ సమావేశమవుతున్నారు కానీ కమల్ కు సానుకూలంగా నిర్ణయం వెలువడకపోవచ్చు. ఒకవేళ లెటర్ లో సారీ చెప్పి ఉంటే ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగేవి. కానీ అలా లేకపోవడంతో అధిక శాతం సభ్యులు బ్యాన్ విషయంలో వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నారట. దీని వల్ల ఎన్ని కోట్ల నష్టం వచ్చినా అది పూర్తిగా ఆయన స్వంత బ్యానర్ రాజ్ కమల్ మీద పడనుంది. డిస్టిబ్యూటర్లు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. పబ్లిసిటీ కోసం పెట్టిన ఖర్చులో పైసా వెనక్కు రాదు.
ఎంతలేదన్నా థగ్ లైఫ్ ఫలితాన్ని బట్టి ఇరవై నుంచి ముప్పై కోట్ల వరకు కమల్ నష్టపోయినట్టేనని ట్రేడ్ వర్గాల అంచనా. ఒకవేళ విక్రమ్ స్థాయిలో ఇది బ్లాక్ బస్టర్ అయితే పోగొట్టుకున్న మొత్తం అంతకన్నా ఎక్కువే అవుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. థగ్ లైఫ్ కమల్ హాసన్ చివరి సినిమా కాదు. నిర్మాణంలో ఉన్నవి, ఓకే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడీ వివాదం ప్రభావం తిరిగి అప్పుడు కూడా పడుతుంది. తమిళం నుంచి కన్నడ పుట్టిందనే మాట చెప్పడమే ఇక్కడి దాకా తెచ్చింది. దానికి ఆధారాలు లేనప్పుడు క్షమాపణ చెప్పేస్తే పోయేది కానీ లోక నాయకుడు ఎంత మాత్రం తగ్గేలా లేరు.
This post was last modified on June 3, 2025 4:40 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…