ఇతర భాషల్లో వచ్చిన కొన్ని మంచి పాటలు డబ్బింగ్ కాకపోవడం వల్లనో లేదా ఆయా చిత్రాల బాక్సాఫీస్ ఫలితాల వల్లనో మనకు రీచ్ కావు. వాటి గొప్పదనం గుర్తించే దర్శకులు తమ సినిమాల్లో వాడుకున్నప్పుడే అవి బయట పడతాయి. అందులోనూ మన తమన్ కంపోజ్ చేసిన పాట ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడం చూస్తే ఇదే అనిపిస్తుంది. గత నెల మే 1 హిట్ 3 ది థర్డ్ కేస్ తో పాటు విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ తమిళంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. నాలుగు వారాలకే ఎనభై అయిదు కోట్ల దాకా వసూలు చేసి ఔరా అనిపించింది. నిన్నటి నుంచి తెలుగు అనువాదంతో పాటు హాట్ స్టార్లో వచ్చేసింది.
ఇందులో హీరో శశికుమార్, అతని ఇద్దరు పిల్లలు డాన్స్ చేసే ఒక మంచి సీన్ ఉంది. దానికి బ్యాక్ గ్రౌండ్ లో పాత సాంగ్ పెట్టారు. అది 2011లో వచ్చిన ‘మంబత్తియన్’ అనే సినిమాలో ‘మలైయూరు నట్టమై’ అనే పాట. హీరో ప్రశాంత్, మీరా జాస్మిన్ నటించిన ఈ మూవీ అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఆడియో పెద్ద హిట్టయ్యింది. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఒకప్పుడు ఆయన హీరోగా 1983లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘మలయూరు ముంబత్తియన్’ని కొడుకుని హీరోగా పెట్టి రీమేక్ చేసుకున్నారు. కానీ ఫలితం అదే దక్కలేదు కానీ యావరేజ్ దగ్గర ఆగిపోయింది.
విశేషం ఏంటంటే తమన్ స్వరపరిచిన ఈ మలైయూరు నట్టమై పాటని టూరిస్ట్ ఫ్యామిలీతో పాటు మరో మలయాళ సినిమా ప్రిన్స్ అండ్ ఫ్యామిలీలోనూ వాడుకోవడం విశేషం. కాకతాళీయంగా రెండు సందర్భాల్లోనూ పెళ్లి కూతురు డాన్స్ చేయడాన్ని ముందు హైలైట్ చేస్తారు. టూరిస్ట్ ఫ్యామిలీ చూసిన ప్రేక్షకులు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారో యూట్యూబ్ లో వెతికి మరీ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కంపోజర్ తమన్ కాబట్టి. ఇదే తరహాలో తమన్ గతంలో విశాల్ ఎనిమి కోసం ఇచ్చిన టుం టుం కూడా ఇంతే స్థాయిలో చార్ట్ బస్టర్ అయిపోయి ఆరు వందల మిలియన్లకు వ్యూస్ సాధించడం గమనార్హం.
This post was last modified on June 3, 2025 12:17 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…