ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో కొత్త బంధంలోకి వెళ్లబోతున్న సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమిర్ కొత్త బంధం గురించి కొన్ని నెలలుగా రూమర్లు వినిపిస్తుండగా.. ఈ మధ్యే ఆమిర్ స్వయంగా దీని గురించి వెల్లడించాడు. గౌరీ స్ప్రాట్ అనే తన స్నేహితురాలితో ఏడాదిగా డేటింగ్ చేస్తున్నట్లు తన పుట్టిన రోజు సందర్భంగా చెప్పాడు. గౌరీని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చూచాయిగా చెప్పాడు. ఐతే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. అలా అని గౌరీ నుంచి ఆమిర్ ఏమీ విడిపోవట్లేదు. పెళ్లి చేసుకోకుండా ఆమెతో కలిసి ఉండాలని భావిస్తున్నట్లుగా ఆమిర్ సంకేతాలు ఇచ్చారు. బహుశా రెండుసార్లు వివాహ బంధం నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో ఈసారి అధికారిక బంధంలోకి వెళ్లకుండా గౌరీతో కలిసి సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. గౌరీతో తన బంధం గురించి ఆమిర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని.. అప్పట్నుంచి తనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టానని ఆమిర్ తెలిపాడు. తాను, గౌరీ అనుకోకుండానే కలిశామని.. తర్వాత స్నేహితులం అయ్యామని.. కొన్నేళ్ల తర్వాత తమ మధ్య ప్రేమ పుట్టిందని ఆమిర్ తెలిపాడు. తనకు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారని.. రోజంతా వారితో గడుపుతానని.. కాబట్టి ఇక తనకు జీవిత భాగస్వామి అవసరం లేదని భావించేవాడినని.. కానీ గౌరీకి, తనకు తర్వాత నిజమైన ప్రేమ పుట్టిందని.. దీంతో కలిసి జీవించాలని భావించామని ఆమిర్ తెలిపాడు.
తామిద్దరం భార్యాభర్తలం కాకపోవచ్చని.. కానీ ఎప్పటికీ కుటుంబంగానే ఉంటామని చెప్పడం ద్వారా.. తాము అధికారికంగా వైవాహిక బంధంలోకి వెళ్లకపోవచ్చనే సంకేతాలు ఇచ్చాడు ఆమిర్. బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ తనయురాలే గౌరీ స్ప్రాట్. ఆమెకు బెంగళూరులో పెద్ద సెలూన్ ఉంది. ఆమిర్ నిర్మాణ సంస్థలో ఆమె చాలా ఏళ్ల పాటు పని చేసింది. ఆమెతో ఆమిర్‌కు 25 ఏళ్ల స్నేహం ఉంది. గౌరీకి ఇంతకుముందే పెళ్లయింది. విడాకులు తీసుకుంది. ఆమెకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.
This post was last modified on June 2, 2025 4:33 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…