అల్లు అర్జున్ కి రెండో సినిమాతోనే ఇమేజ్, ఫాలోయింగ్ తెచ్చిన సినిమాగా ఆర్య మీద అభిమానులకు ప్రత్యేకమైన గౌరవముంది. పుష్పతో ఇండియాని షేక్ చేసే రికార్డులు సాధించిన సుకుమార్ ని పరిచయం చేసిన బ్లాక్ బస్టర్ ఇదే. ఆ అంచనాల బరువు ఎక్కువైపోయి ఆర్య 2 అప్పట్లో ఆశించిన విజయం అందుకోలేదు. ఇటీవలే రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ పాటలను, బన్నీ వెరైటీ క్యారెక్టరైజేషన్ ని ఎంజాయ్ చేశారు కానీ కంటెంట్ పరంగా ఇప్పటికీ అందులో హెచ్చుతగ్గులు ఫీలవుతాం. ఏది ఏమైనా ఆర్య అంటే చాలు ఠక్కున గుర్తొచ్చేది అల్లు అర్జున్ ఒక్కడే. ఇప్పుడు ఆర్య 3కి రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి హీరో మారుతున్నాడు.
నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ తో ఆర్య 3 తీయడం దాదాపు లాకైపోయినట్టే. ఫస్ట్ పార్ట్ తీసిన ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి టైటిల్ గురించి హక్కుల సమస్య లేదు. ఎలాగూ బన్నీ ఈ సీక్వెల్ ని చేసే ఛాన్స్ ఎంత మాత్రం లేదు. సో ఆశిష్ కి ఇవ్వడం న్యాయమే. కానీ అంత లెగసి ఉన్న టైటిల్ ని ఇప్పటిదాకా సరైన హిట్టు లేని ఈ కుర్రాడు మోయగలడా అనే దాని మీద అనుమానం లేకపోలేదు. అయితే అభయహస్తం ఇస్తూ సుకుమార్ దీనికి స్క్రీన్ ప్లే సహకారంతో పాటు మాటలు అందిస్తానని హామీ ఇచ్చారట. ఆయన రైటింగ్స్ అనే ముద్ర పడితే ఆటోమేటిక్ గా థియేటర్ తో పాటు ఓటిటిలో కూడా డిమాండ్ వచ్చేస్తుంది.
ఆర్య తరహాలో ఆర్య 3లో హీరోకి డిఫరెంట్ పాత్రని డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. వన్ సైడ్ లవ్ లాగే ఈసారి ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ని సుకుమార్ ఇస్తారట. గతంలో ఇదే ఆశిష్ తో తన రచనలో కాశి విశాల్ దర్శకుడిగా సెల్ఫిష్ షూటింగ్ మొదలుపెట్టి రషెస్ సరిగా రాక పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. దానికి ప్రత్యాన్మయంగా ఆర్య 3ని తీస్తున్నారనేది ఒక టాక్. అయితే డైరెక్టర్ అతనా వేరొకరికి ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆశిష్ ప్రస్తుతం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో దేత్తడి అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. ఆశిష్ కి టాలీవుడ్ లో సాలిడ్ కెరీర్ ఇవ్వాలనేది దిల్ రాజు లక్ష్యం.
This post was last modified on June 2, 2025 4:28 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…