Movie News

రాజా సాబ్ వస్తున్నాడు…డేట్లు ఖరారు ?

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ రాకకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల జూన్ 15 టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అందులోనే సినిమా ఎప్పుడు విడుదవుతుందనేది పొందు పరిచారట. విశ్వసనీయ సమాచారం మేరకు టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ హారర్ డ్రామా డిసెంబర్ 12న థియేటర్లలో అడుగు పెట్టనుందని తెలిసింది. డిసెంబర్ 25 అడివి శేష్ డెకాయిట్ తీసుకున్న నేపథ్యంలో అదే నెల మొదటి వారం కన్నా మధ్యలో రావడమే బిజినెస్ కోణంలో బెస్టని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని యూనిట్ సభ్యుల మాట.

అఫీషియల్ స్టాంప్ లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం కానీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాలన్స్ ఉన్న పాటలు, షూటింగ్ ని అక్టోబర్ లోగా పూర్తి చేద్దామని ప్రభాస్ హామీ ఇవ్వడంతో దర్శకుడు మారుతీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీ అయ్యారట. టీజర్ కు డబ్బింగ్ అయిపోయింది. విజువల్స్ చూశాక అంచనాలు మారిపోవడం ఖాయమని, ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుందనే ధీమాతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉందట. ఈ మధ్యే లీకైన స్టిల్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ మాములుగా వెర్రెక్కిపోలేదు. ఇక అదే గెటప్ తో డైలాగులు చెబుతూన్న ప్రభాస్ ని చూస్తే ఏమైపోతారో ఊహించడం కష్టం.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన నెలలోనే ది రాజా సాబ్ రావడం మంచిదే. సంక్రాంతి కన్నా ముందే బాక్సాఫీస్ దగ్గర మొత్తం రాబట్టుకోవచ్చు. అనుకుంటాం కానీ కరెక్ట్ కంటెంట్ పడితే ఈ నెలలో వచ్చిన బ్లాక్ బస్టర్లు చాలానే ఉన్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి హిందీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 12 ఎంచుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే క్రిస్మస్ కి యష్ రాజ్ ఫిలింస్ అలియా భట్ స్పై మూవీ ‘ఆల్ఫా’ని ప్లాన్ చేస్తోందట. అదే నిజమైన పక్షంలో రాజా సాబ్ తీసుకున్న డెసిషన్ రైటే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లు నటించిన ఈ సినిమా సంజయ్ దత్ పాత్ర మరో ఆకర్షణ కానుంది.

This post was last modified on June 2, 2025 6:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

3 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

38 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago