నిన్న 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలానికి ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. ముఖ్యంగా కొన్ని మంచి సినిమాలకు గుర్తింపు దక్కలేదనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. 2014 లిస్టులో అక్కినేని లాస్ట్ మూవీ ‘మనం’ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనరైన అల్లుడు శీనుకిచ్చిన మూడో స్థానం కూడా మనంకు ఇవ్వకపోవడం పట్ల క్రమంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
సెన్సార్ డేటుతో పాటు తెలంగాణ ఏర్పాటు తేదీని పరిగణనలోకి తీసుకోవడం వల్లే మనం మిస్సయ్యిందనే వర్షన్ గద్దర్ సభ్యుల నుంచి వినిపిస్తోంది. ఏఎన్ఆర్ చివరి సినిమా, అందులోనూ విక్రమ్ కె కుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో దాన్ని నడిపించిన విధానం మనంని క్లాసిక్ గా మార్చింది. రిలీజ్ డేట్ నే పరిగణనలోకి తీసుకోవాలనేది ఏఎన్ఆర్ అభిమానుల డిమాండ్. ఇక 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సైతం పురస్కారానికి నోచుకోలేదు. మహర్షిలో ఎంత సందేశం ఉన్నా అది కమర్షియల్ మూవీనే. కానీ రాయలసీమ యోధుడి మీద తీసిన సైరా ఏ విధంగా ఉత్తమ చిత్రం కాలేదని మెగా ఫ్యాన్స్ క్వశ్చన్.
జ్యురి సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా గద్దర్ అవార్డుల ఎంపిక జరిగిందనే గుసగుసలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన దసరా, విరాట పర్వం లాంటి వాటిని సైతం గుర్తించకపోవడం ఇంకో ట్విస్టు. అవి విమర్శకులను సైతం మెప్పించిన సినిమాలు కదా. హాయ్ నాన్న చోటు దక్కించుకోకపోవడం ఇంకో షాక్. నంది అవార్డులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్లు జరిగేవి కానీ ఒకప్పుడు వీటికి బాక్సాఫీస్ కలెక్షన్లను ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు కాదు. కానీ గద్దర్ లిస్టు చూస్తుంటే మాత్రం కమర్షియల్ స్టేటస్ పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది.
This post was last modified on May 31, 2025 10:17 am
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…