Movie News

కీర్తి సురేష్ తెలివైన నిర్ణయం

మహానటితో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నా హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులతో ప్రయాణం చేస్తున్న కీర్తి సురేష్ కు పెళ్ళయాక కూడా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్ తీవ్రంగా నిరాశపరిచినా రాజ్ కుమార్ రావుతో సెక్టార్ 36లో ఛాన్స్ రావడం గురించి బాలీవుడ్ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శనాస్త్రంగా రూపొందబోయే ఈ సినిమాకు ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్ర ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేస్తుందట. అందుకే ఏరికోరి మరీ కీర్తి సురేష్ ని తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అయితే మన మ్యాటర్ దాని గురించి కాదు లెండి.

ఇటీవలే సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ మొదలైన సంగతి తెలిసిందే. సూర్యకు జోడిగా మమిత బైజుని తీసుకున్నారు. నిజానికి మొదటి ఛాయస్ గా కీర్తి సురేష్ ని అడిగారట. కానీ తను అప్పటికీ విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబోతో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే రౌడీ జనార్దనా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే పరిస్థితి వచ్చిందట. కీర్తి సురేష్ ఆల్రెడీ సూర్యతో గ్యాంగ్ చేసింది. మహానటిలో విజయ్ దేవరకొండ క్యామియో చేశాడు కానీ ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్లు లేవు. ఈ కారణంగా రౌడీ జనార్దనా వైపు మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది.

అందరు స్టార్ హీరోలతో నటించాలన్న టార్గెట్ పెట్టుకున్న కీర్తి సురేష్ దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటోంది. గతంలో చిరంజీవి చెల్లెలిగా భోళా శంకర్ ఆఫర్ ని సాయిపల్లవి తిరస్కరిస్తే దాన్ని కీర్తి సురేష్ అందిపుచ్చుకుంది. రజనీకాంత్ చెల్లెలిగా పెద్దన్నలో పోటీ పడి నటించింది. వీటి ఫలితాలు నిరాశపరిచినా తెలుగు తమిళ సీనియర్ స్టార్లతో నటించిన సంతృప్తి మిగిలింది. ఇక ఇప్పుడు హీరోయిన్  గా అవకాశాలు తగ్గిపోయిన తరుణంలో రౌడీ హీరో సరసన అంటే మంచి ఛాన్సే. తను టైటిల్ రోల్ పోషించిన రివాల్వర్ రీటా విడుదల కావాల్సి ఉండగా సుహాస్ తో నటించిన ఉప్పు కప్పురంబు అప్డేట్స్ ఆగిపోయాయి.

This post was last modified on May 30, 2025 9:49 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

56 minutes ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

1 hour ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

1 hour ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

1 hour ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

5 hours ago